Begin typing your search above and press return to search.

సర్వం బంద్: లాకప్ డెత్ తో ఉడికిపోతున్న తమిళనాడు

By:  Tupaki Desk   |   24 Jun 2020 11:10 AM GMT
సర్వం బంద్: లాకప్ డెత్ తో ఉడికిపోతున్న తమిళనాడు
X
ఇప్పటికే వైరస్ తో తమిళనాడు లో భయాందోళనకరంగా పరిస్థితి ఉంది. ఇప్పుడు తమిళనాడు మరో సంఘటనతో ఉడికిపోతోంది. ఓ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బుధవారం 24 గంటల బంద్ కొనసాగింది. ఈ ఆందోళనలకు అన్ని వర్గాలు మద్దతు తెలిపాయి.

తూతుకుడిలో లాకప్ డెత్ జరిగింది. దీంతో ఈ ఘటనపై తమిళనాడు అట్టుడికిపోతోంది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. వీరికి వ్యాపార సంస్థలు మద్దతు పలికాయి. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. శాతంకులం పోలీసులు విచారణలో తండ్రికొడుకులు జయరాజ్, కొడుకు ఫీనిక్స్ మృతి చెందారు. వీరి మృతిపై న్యాయ విచారణ చేయాలని తమిళనాడు వ్యాప్తంగా డిమాండ్ వస్తోంది. రోజు రోజుకు ఆందోళనలు ఉద‌ృతమవుతున్నాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మఘ్ద్దతుగా నిలిచారు.

ఈ లాకప్ డెత్ కారణమైన పోలీసు అధికారులను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనను మధురై కోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టి పంచనామా నిర్వహణకు ముగ్గురు వైద్యులను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు కారణమైన సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ సస్పెండ్ చేసింది. స్టేషన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.