Begin typing your search above and press return to search.

న‌గ్న నిర‌స‌న‌తో మోదీకి షాకిచ్చారే!

By:  Tupaki Desk   |   10 April 2017 10:59 AM GMT
న‌గ్న నిర‌స‌న‌తో మోదీకి షాకిచ్చారే!
X
సాగులో న‌ష్టాల కార‌ణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన త‌మ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించాలంటే... రుణాల‌ను మాఫీ చేయ‌డ‌మొక్క‌టే మార్గ‌మంటూ హ‌స్తిన బాట ప‌ట్టిన త‌మిళనాడు అన్న‌దాత‌లు నెల రోజుల‌కు పైగా అక్క‌డే ఉంటున్నారు. రుణ మాఫీ డిమాండ్ సాధ‌న కోసం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వారు వ‌రుస నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేపట్టారు.

పుర్రెలు, ఎముక‌లు చేత‌బ‌ట్టుకుని నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన వారంతా... రుణాలు మాఫీ చేయ‌కుంటే ఆత్మ‌హ‌త్య‌లే త‌మ‌కు గ‌తి అంటూ త‌మ గోడును కేంద్ర ప్ర‌భుత్వానికి విన‌ప‌డేలా చేశారు. అయితే వీరి రోద‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి విన‌ప‌డిన‌ట్టుగా లేదు. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన త‌మిళ రైతులు నేటి ఉద‌యం ఢిల్లీలో వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించేలా చేయాల‌ని భావించిన రైతులు... ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం ఉన్న సౌత్ బ్లాక్ ను తమ తాజా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంచుకున్నారు.

నేటి ఉద‌యం చ‌డీ చ‌ప్పుడు కాకుండా సౌత్ బ్లాక్ చేరుకున్న రైతులు న‌డిరోడ్డుపై న‌గ్నంగా నిర‌స‌న‌కు దిగారు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు... ఏకంగా ప‌ది మందికి పైగా రైతులు న‌గ్నంగా త‌యారై సౌత్ బ్లాక్ ముందు నిర‌స‌న‌కు దిగ‌డంతో అక్క‌డ క‌ల‌క‌లం రేగింది. మ‌రి ఈ నిర‌స‌న‌తోనైనా త‌మిళ‌నాట రైతుల రుణాల మాపీకి సంబంధించి ప్ర‌ధాని నిర్ణ‌యం తీసుకుంటారో? లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/