Begin typing your search above and press return to search.

నువ్వు గోల్డెహే.. ! ఐదుకిలోల బంగారం ధరించి నామినేషన్​ వేసిన హరినాడార్​..!

By:  Tupaki Desk   |   18 March 2021 4:19 AM GMT
నువ్వు గోల్డెహే.. ! ఐదుకిలోల బంగారం ధరించి నామినేషన్​ వేసిన హరినాడార్​..!
X
తమిళనాడు లో ఓ బంగారు బాబు ఉన్నాడు. ఆయనే హరినాడార్​. ఒంటి నిండా కిలోలకొద్దీ బంగారం ధరిస్తూ అందరినీ ఆకర్షిస్తుంటాడు. ఆ మధ్య ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్టు ప్రకటించాడు. అప్పుడప్పుడు కిలోల కొద్ది బంగారం ఒంటిమీద ధరించి.. ప్రముఖుల వేడుకల్లో కనిపిస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ప్రస్తుతం తమిళనాడు లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ నియోజక వర్గంలో నామినేషన్​ దాఖలు చేసి మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించాడు హరి నాడార్​. ప్రస్తుతం అళంగుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేశాడు. ఆయన నామినేషన్​ దాఖలు చేసేందుకు తన ఒంటిమీద దాదాపు 5 కిలోల బంగారం ధరించి వచ్చాడు. ఆయన వేషధారణను చూసిన ప్రజలు, మీడియా ఆశ్చర్యపోయాయి.

నిజానికి తమిళ ప్రజలకు ఆయన కొత్త కాదు. నిన్న జాతీయ మీడియా సంస్థల్లోనూ ఈ వార్త వచ్చింది. తన వద్ద మొత్తంగా 11.2 కేజీల బంగారం ఉందని.. నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నాడు హరినాడార్​. ప్రస్తుతం ఆయన నామినేషన్​ వేసిన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. భారతీయులకు బంగారం ఎంత ప్రీతిపాత్రమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్త్రీలకు బంగారు ఆభరణాల మీద ఎక్కువ మోజు ఉంటుంది. ఏ పేరంటానికి వెళ్లినా.. బంగారు ఆభరణాలు ప్రదర్శించడం వాళ్లకు అలవాటు. ఎంత ఖరీదైన నగలు ధరించారు..

ఎన్ని వెరైటీ ఆర్నమెంట్లు పెట్టుకున్నారన్న దాని మీదే వాళ్ల విలువ ఆధారపడి ఉంటుంది. అంతలా ఇక్కడ బంగారానికి క్రేజ్​ .ఇదిలా ఉంటే అప్పుడప్పుడు మనదేశంలో ఇటువంటి బంగారు బాబులు కూడా ప్రత్యక్షమవుతుంటారు. ఏకంగా బంగారంతో దుస్తులు కూడా కుట్టించుకున్నారు గతంలో కొందరు.తాజాగా ఈ హరినాడార్​ ఒంటినిండా బంగారం ధరించి అందరినీ ఆకర్షించాడు.