Begin typing your search above and press return to search.

పోలీసులకు అబ్బాయిల్ని ఎర వేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2016 8:05 AM GMT
పోలీసులకు అబ్బాయిల్ని ఎర వేస్తున్నారు
X
సాధారణంగా తమ పనులు పూర్తి చేసుకోవటానికి వీలుగా అందమైన అమ్మాయిల్ని ప్రయోగించటం చూస్తుంటాం. కానీ.. అందుకు భిన్నంగా అందమైన అబ్బాయిల్ని ఎరగా వేస్తున్న విచిత్రం ఒకటి చోటుచేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ విధానాన్ని తాలిబన్లు అనుసరించటం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల్ని లైంగికపరంగా ఆకర్షించి.. వారిని ముగ్గులోకి దించటం.. అనంతరం అధికారుల మీదా.. సిబ్బంది మీద దాడులకు పాల్పడటం లాంటి పనులకు తాలిబన్లు తెర తీస్తున్నారు.

గడ్డం లేని అందమైన యువకుల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి.. వారితో పోలీసుల్ని ఆకర్షిస్తున్న తాలిబన్లు.. అనంతరం ఆ పోలీసులపై విషప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరూ పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని.. ఈ దుర్మార్గపు వైఖరితో వందలాది మంది పోలీసులు అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారని చెబుతున్నారు.

లైంగిక బలహీనత ఉన్న పోలీసుల్ని గుర్తిస్తున్న తాలిబన్లు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఒక కుర్రాడు ఇదే తీరుతో వ్యవహరించి ఏడుగురు పోలీసుల్ని కాల్చేసిన ఘటన వెలుగులోకి రావటం గమనార్హం.