Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ గందరగోళం..తలసానిలో వణుకు

By:  Tupaki Desk   |   14 Sept 2019 5:23 PM IST
టీఆర్ ఎస్ గందరగోళం..తలసానిలో వణుకు
X
మునుపెన్నడూ లేని ఇబ్బంది - గందరగోళం ఇటీవల టీఆర్ ఎస్ పార్టీలో కనిపిస్తోంది. తిరుగులేని ముఖ్యమంత్రిగా చెలామణి అవుతున్న కేసీఆర్ పై ధిక్కార ధోరణి... దానిపై నేతలకు కేటీఆర్ క్లాసులు - బుజ్జగింపులు వీటన్నింటి నేపథ్యంలో టీఆర్ ఎస్ నేతలు భయభయంగా ఉంటున్నారు. తాజాగా అసంతృప్తుల గురించి మీడియా ఆయనతో ప్రస్తావిస్తే... వద్దండీ - బయట పరిస్థితులు బాలేవు. నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు అని నేరుగా చెప్పేసి తప్పించుకున్నారు తలసాని. కానీ ఈ గందరగోళానికి - నేతల్లో ధైర్యానికి కారణం బీజేపీ అని పబ్లిక్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ గురించి తలసాని పలు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ హవా అంతా మీడియాలోనే ఉందన్నారు. గ్రౌండ్ లో బీజేపీ ప్రభావం శూన్యం అని చెప్పిన తలసాని... వచ్చే ఏ ఎన్నికలు అయినా టీఆర్ ఎస్ దే ఘన విజయం అని వ్యాఖ్యనించారు. పార్టీలో ఎవరికీ అసంతృప్తి లేదని - అంతా సజావుగా ఉందన్నారు. నాకు తెలియని - మీకు తెలిసినవి ఏమైనా ఉంటే వారినే అడగడం మంచిదని తప్పించుకున్నారు. ఇక కేటీఆర్ సత్తాకు - టీఆర్ ఎస్ భవిష్యత్తుకు సాక్ష్యంగా నిలవబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల గురించి ఆయన స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరుగుతాయని... గతం కంటే మెరుగైన ఫలితాలే టీఆర్ ఎస్ కు వస్తాయన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ హవా ఖాయం అన్నారు.