Begin typing your search above and press return to search.

ఏర్చి కూర్చి పేర్చి.. పేర్ని నాని పంచులు

By:  Tupaki Desk   |   27 Jan 2020 3:39 PM IST
ఏర్చి కూర్చి పేర్చి.. పేర్ని నాని పంచులు
X
అచ్చ గోదావరి యాస లో అదరగొడుతుంటారు మంత్రి పేర్ని నాని.. గోదావరి జిల్లాలకు చెందిన ఈ వైసీపీ మంత్రి సందర్భానుసారంగా వేసే పంచులకు అసెంబ్లీలో ఇంటా బయటా అందరూ నవ్వేస్తుంటారు. కథలు, కవితలు, ఇతిహాసాలు చెబుతూ అందులో ప్రతిపక్షాలను మిళితం చేసి ఈయన వేసే జోకులకు అసెంబ్లీలో నవ్వులు పూస్తున్నాయి..

తాజాగా ఏపీ అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లుపై మాట్లాడిన పేర్ని నాని.. గతంలో చంద్రబాబు మండలి రద్దు చేయాలని మాట్లాడిన వీడియోను చూపించి ఎండగట్టారు. తర్వాత మాట్లాడిన మంత్రి పేర్ని నాని ‘రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా సీఎం వైఎస్ జగన్ ఆశయాలను చంద్రబాబు, లోకేష్ లు అడ్డుకుంటున్నారని’ సెటైర్లు వేశారు. చారిత్రిక బిల్లును అడ్డుకొని టీడీపీ శునకానందం పొందుతోందని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు బిల్లులు అడ్డుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని ఆడి పోసుకున్నారు.

రాయలసీమకు నీళ్లిచ్చామంటున్న చంద్రబాబు కు గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వదిలేసిన సీమలోని కొల్లేరు కు ఇదే సీఎం జగన్ 350 కోట్లతో రెగ్యులేటర్లు ఏర్పాటు కు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.