Begin typing your search above and press return to search.
బాయ్స్ లాకర్ రూమ్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది ఆగ్రహం
By: Tupaki Desk | 6 May 2020 4:42 PM ISTప్రస్తుతం దేశంలో బాయ్స్ లాకర్ రూమ్ ఇన్‌స్టాగ్రామ్ గ్రూపు చర్చలపై రచ్చ సాగుతోంది. ఈ గ్రూప్ నిర్వాహకులు, చర్చ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోంది. సౌత్ ఢిల్లీలోని కొన్ని ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న కొంత మంది టీనేజ్ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్లో 'Boys Locker Room' అనే ఓ చాట్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో తమ క్లాస్ మేట్స్ కొంతమంది మహిళల ఫోటోలు షేర్ చేసి వాళ్ల ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్య కామెంట్స్ చేశారు. 'నేను గట్టిగా చెప్తున్నా.. దాన్ని మనం ఈజీగా రేప్ చేయవచ్చు.. ' 'ఆమెకు ఫోన్ చేసి రమ్మను.. నువ్వు చెప్పిన చోటుకు వస్తా.. మన బాయ్స్ని కూడా పిలుస్తా.. అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం..' అంటూ చెప్పలేని రీతిలో అందులో చాట్ చేశారు. ఈ గ్రూపునకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసిన ‘బాయ్స్ లాకర్ రూం’ గ్రూప్ సభ్యులపై సుమోటో యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది నీలా గోఖలే ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్‌కు లేఖ రాశారు. అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడాలంటూ అశ్లీల సంభాషణకు తెరతీసిన పాఠశాల విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు పోక్సో, ఐటీ చట్టం, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మే 4వ తేదీన లేఖ రాశారు. బాయ్స్ లాకర్ రూం సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీకి చెందిన కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించడం, వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడటం వంటి విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చించారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. మహిళల ప్రైవేటు భాగాల గురించి, లైంగిక హింస వారు విపరీత, అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం తో వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి.