Begin typing your search above and press return to search.
కోహ్లీపై చర్యలు తీసుకోండి.. అంపైర్‌తో ఆ గొడవేంటి?
By: Tupaki Desk | 17 Feb 2021 5:06 PM ISTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ పేర్కొన్నారు. వేరే ఆటలో ఇటువంటి చర్యలకు దిగితే బయటకు పంపిస్తారని చెప్పారు. క్రికెట్లో అంపైర్ నిర్ణయమే ఫైనల్ అని క్రీడాకారులు దాన్ని గౌరవించాలని సూచించారు. విరాట్ కోహ్లీని అహ్మదాబాద్‌లో జరిగే డై అండ్ నైట్ మ్యాచ్‌లో ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు.
విరాట్ కోహ్లీ ప్రవర్తనకు రెడ్ కార్డ్ ఇచ్చి మైదానం వీడేలా చేసేవారని తెలిపాడు. కోహ్లీ పదే పదే నిబంధనలు ఉల్లంఘించినా రిఫరీ పట్టించుకోవడం లేదు. అంటే రిఫరీ మ్యాచ్ చూడకుండా ఏసీ గదిలో నిద్రపోతూ ఉన్నాడేమో అంటూ ఘాటుగా లాయిడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ చేసిన తప్పేంటి?
సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడోరోజు చివరి సెషన్లో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అంపై నితిన్ మీనన్‌తో గొడవకు దిగాడు.
ఆ సెషన్లో అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్‌లో జో రూట్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత జట్టు అప్పీల్ చేసింది. బంతి రూట్ ప్యాడ్‌కు వెనుక భాగంలో తగిలింది. ఆ తర్వాత కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ పట్టాడు.
ఫీల్డర్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్‌గా ఇచ్చాడు. దీంతో టీమిండియా రివ్యూకు వెళ్లింది. రీప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదు కానీ ఆఫ్ స్టంప్స్‌కు తాకినట్లు చూపించింది. దాంతో టీవీ అంపైర్ కూడా ఫీల్డర్ అంపైర్ నిర్ణయాన్నే సమర్థించాడు.
అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి రవిశాస్త్రి మాత్రం ఓట్ అయినట్టు సైగలు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ .. అంపైర్ నితిన్ మీనన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో ఆయన మీదకు దూసుకెళ్లాడు. ఈ చర్య తీవ్ర వివాదాస్పదం అయ్యింది.
అయితే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.8 ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగినా.. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా తప్పిదమే. ఈ నేపథ్యంలోనే విరాట్‌పై చర్యలు తీసుకోవాలని డేవిడ్ లాయిడ్ అంటున్నాడు.