Begin typing your search above and press return to search.

త‌బ్లిగీ జ‌మాత్‌ .. పాక్‌ కు కూడా పాకించారు..

By:  Tupaki Desk   |   3 April 2020 8:10 AM GMT
త‌బ్లిగీ జ‌మాత్‌ .. పాక్‌ కు కూడా పాకించారు..
X
కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిందని భావిస్తున్న క్రమంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ లో ఉన్న త‌బ్లిగీ జ‌మాత్‌ ప్రార్థనలతో ఆ వైరస్‌ తీవ్రంగా ప్రబలించింది. నిజాముద్దీన్‌ లో మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొనగా ఆ ప్రార్థనల్లో కరోనా వైరస్‌ సోకిన వారు కూడా ఉండడంతో ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఒకరికొకరికి అంటుకుంది. దీంతో వెయ్యిలోపు ఉన్న కరోనా కేసులు ఇప్పుడు ఏకంగా రెండున్నర వేలకు చేరాయి. అయితే దీని బారిన భారత్‌ తోపాటు పాకిస్తాన్‌ కు కూడా పాకనుంది. ఎందుకంటే ఆ ప్రార్థనలకు పాకిస్తాన్‌ దేశస్తులు కూడా రావడంతో ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాకిస్థాన్‌ కు కూడా త‌బ్లిగీ జ‌మాత్ సంస్థ టెన్షన్ పట్టుకుంది.

పాక్‌ లోని రైవిండ్ నగరంలో త‌బ్లిగీ జ‌మాత్ ప్రధాన కార్యాల‌యం ఉంది.. అక్కడ సుమారు 101 మంది మ‌త‌ బోధ‌కుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ లో ఉన్న త‌బ్లిగీ జ‌మాత్‌ కు సంబంధం ఉన్న సంస్థ ఇదే. దీంతో పాకిస్తాన్‌ లో కలవరం మొదలైంది. రైవిండ్ మ‌ర్కజ్‌ లో సుమారు 1,218 మంది త‌బ్లిగీ జ‌మాత్ స‌భ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ దేశంలో ప్రభుత్వం కరోనా సోకిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మ‌ర్కజ్‌ లో ఉన్న సుమారు 900 మందిని క్వారెంటైన్ చేశారు. దీని ప్రభావంతో సుమారు 2 లక్షల జనాభా ఉన్న రైవింగ్ నగరాన్ని ప్రస్తుతం లాక్‌డౌన్ విధించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

దీంతో పాటు పాకిస్థాన్‌ లోని పంజాబ్‌ లో కూడా ఈ ప్రార్థనలు జరిగాయి. మార్చిలో దాదాపు 2,50,000 మంది ప్రజలు ప్రార్థనలు చేశారని గుర్తించారు. ఐదు రోజుల కార్యక్రమంలో లేదా త‌బ్లిగీ జ‌మాత్‌ లో పాల్గొన్నారు. దీంతో అక్కడ వైరస్‌ ప్రబలిందని సమాచారం. దీంతో పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ లో కలవరం మొదలైంది. త‌బ్లిగీ జ‌మాత్‌ తో ఇప్పటికే భారత్‌ లో కల్లోలం రేగుతోంది. ఇప్పుడు పాకిస్థాన్‌ లో కూడా అలాంటివి జరగడంతో ఆ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ముందే ఆర్థికంగా వెనకబడిన దేశం ప్రస్తుతం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.