Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్‌.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ?

By:  Tupaki Desk   |   4 Nov 2019 3:17 PM GMT
టీ20 వరల్డ్ కప్‌.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ?
X
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. ఈసారి పలు కొత్త దేశాలూ బ్యాట్ ఝుళిపించడానికి రెడీ అవుతున్నాయి. క్రికెట్ అభిమానులకు అంతోఇంతో పరిచయం ఉన్న ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్‌తో పాటు కొత్తగా పపువా న్యూగినియా కూడా ప్రపంచకప్ టీ 20 ఆడనుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి.
క్వాలిఫైంగ్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. టోర్నీలో పసికూనలు ఉండడంతో క్రీడాభిమానులకు బోర్ కొట్టకుండా షెడ్యూల్ రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకుంది. చిన్న జట్లను ఎ, బి గ్రూపులుగా విభజించిన ఐసీసీ అందులో రెండు పెద్ద జట్లును వేసింది. గ్రూప్-ఎలో శ్రీలంక లాంటి పెద్ద జట్టుతోపాటు పపువా న్యూగినియా, ఐర్లండ్‌, ఒమన్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్ వంటి పెద్ద జట్టుతోపాటు నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌‌లను వేసింది.
ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత పొందుతాయి. ఇక, సూపర్-12లో ఉన్న జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విభజించారు. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. అక్టోబరు 18న కార్డినియా పార్క్‌లో శ్రీలంక-ఐర్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబరు 15న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇండియా మ్యాచ్‌‌లు ఎప్పుడెప్పుడంటే..
భారత జట్టు లీగ్ దశలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది.
* అక్టోబరు 24న పెర్త్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో
* 29న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ‘ఎ2’తో ఆడుతుంది.
* అనంతరం ఇంగ్లండ్‌తో మెల్‌బోర్న్‌లోనే తలపడనుంది.
* నవంబరు 5న ‘బి1’ విజేతతో నాలుగో మ్యాచ్ ఉంటుంది.
* నవంబరు 8న ఆఫ్ఘనిస్థాన్‌తో సిడ్నీలో ఐదో మ్యాచ్‌ ఆడుతుంది.