Begin typing your search above and press return to search.

అవుట్‌లుక్‌ కథనంలో ఏం రాసుంది..?

By:  Tupaki Desk   |   1 July 2015 10:32 AM IST
అవుట్‌లుక్‌ కథనంలో ఏం రాసుంది..?
X
ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌పై అవుట్‌లుక్‌ వారపత్రిక రాసిన కథనం దుమారం రేపటం తెలిసిందే. ఈ కథనంలో తనను వ్యక్తిగతంగా కించపరిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటమే కాదు.. సీరియస్‌ అయిన స్మిత సబర్వాల్‌ లీగల్‌నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ఈ కథనంపై తెలంగాణ సర్కారుతో పాటు.. ఐపీఎస్‌ల సంఘం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇంత మంది ఆగ్రహానికి గురి చేసిన అవుట్‌లుక్‌ పత్రిక కథనంలో ఏం ఉందన్న విషయానికి వస్తే.. ఒక కాలమ్‌లో స్మిత సబర్వాల్‌ను ప్రస్తవిస్తూ.. చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటం గమనార్హం.

స్మిత సబర్వాల్‌ ఆరోపిస్తున్నట్లుగా.. తనపై రాసిన కథనం తనను కించపరిచేలా.. తనను అవమానపరిచేలా ఉందన్నట్లుగానే ఇందులోని వ్యాఖ్యలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనికి సదరు మీడియా సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అవుట్‌లుక్‌లో ప్రచురితమైన కథనంలోని కొన్ని మాటలు చూస్తే.. ఈ విషయం అర్థం అవుతుంది.

= ''డీప్‌ థ్రోట్‌'' పేరిట ప్రచురించే కాలంలో 'నో బోరింగ్‌ బాబు' అంటూ స్మిత పేరిట కథనాన్ని ప్రచురించారు.

= ''తెలంగాణ సీఎం పేషీలో నియమించిన ఓ జూనియర్‌ అధికారిణి వ్యవహారం మిస్టరీగా ఉంది''

= ''గతంలో ఆమె ఒక జిల్లాలో పని చేసే వారు. ఎన్నికల తర్వాత ఆమె పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది''

= ''ప్రతి కీలక సమావేశంలో కనిపిస్తుంటారు. సీఎం పేషీ నుంచి వచ్చే దాదాపు అన్ని ఫోటోల్లో ఈమె కనిపిస్తుంది''

= ''ఆమె ఏం పని చేస్తున్నారన్న విషయం ఓ పజిల్‌. అందమైన చీరలు కడుతూ.. కనువిందు చేసే ఈ అధికారిణి ఫ్యాషన్‌కు పర్యాయపదంలా కనిపిస్తుంటారు''

= ''సీఎంవో జరిపే సమావేశాలకు ఇతర అధికారులను ఆహ్వానించే పనిలో ఈమె ఉన్నారు''

= ''సంప్రదాయ వస్త్రధారతో కనిపించే ఈ లౌలీ లేడీ ఇటీవల ఓ ఫ్యాషన్‌ షోలో ట్రౌజర్‌.. టాప్‌ ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు''

= ''ఫ్యాషన్‌ షోలో ఆమె కనిపించటం ఫోటోగ్రాఫర్లకు పని పెట్టింది''