Begin typing your search above and press return to search.

రేవంత్ కు పీసీసీ.. కాంగ్రెస్ విడి పోవడమేనా?

By:  Tupaki Desk   |   14 Nov 2019 9:32 AM GMT
రేవంత్ కు పీసీసీ.. కాంగ్రెస్ విడి పోవడమేనా?
X
కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ఖాయమా? తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ అధిష్టానం తెరపైకి తెస్తున్న నేపథ్యం లో తెలంగాణ కాంగ్రెస్ రెండు గా విడిపోబోతోందన్న భయం కాంగ్రెస్ వర్గాలును వెంటాడుతోందట..

హుజూర్ నగర్ లో ఘోర ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ పదవిని ఉత్తమ్ త్యజించాడన్న ప్రచారం సాగింది. దీంతో ఉత్తమ్ స్థానంలో రేవంత్ ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం స్కెచ్ గీసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఇటీవల హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం దూత గులాం నబీ ఆజాద్ పరోక్షం గా తెర పైకి తీసుకు రాగా కాంగ్రెస్ సీనియర్లు అంతా భగ్గుమన్నారు. రసాభాస గా సమావేశం ముగిసింది. రేవంత్ ను పీసీసీ చీఫ్ గా చేయడానికి కాంగ్రెస్ సీనియర్లు అంతా వ్యతిరేకించారు. దీంతో నియామకం ఆగి పోయిందని ప్రచారం జరిగింది.

ఒకవేళ ఈ సీనియర్ల ను కాదని రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ ను చేస్తే కాంగ్రెస్ కు కంచుకోట గా ఉన్న నల్గొండ తో పాటు బలమైన రెడ్డి సామాజికవర్గ నేతలంతా పార్టీని వీడడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యం గా ఈ వేర్పేటు ఉద్యమానికి సీనియర్ కాంగ్రెస్ బ్రదర్స్ ఆజ్యం పోసే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని పార్టీ అధిష్టానం అనుమానిస్తోందట.. వారితో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. వీరు కాంగ్రెస్ ను చీల్చడానికి రెడీగా ఉన్నారని అధిష్టానానికి సమాచారం అందిందట..

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ లో ఫిరాయింపుల తర్వాత కేవలం ఐదుగురు ఎమ్మెల్యే లు మాత్రమే మిగిలారు. ఈ ఐదుగురిలోంచి ఆ వేర్పాటు బ్రదర్స్ తో కలిపి ముగ్గురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ ను వీడితే అనర్హత వేటు పడదు. సో వారి ఎమ్మెల్యే పదవుల కు కూడా ఢోక ఉండదు. రేవంత్ ను పీసీసీ చీఫ్ చేస్తే ఇదే ప్లాన్ ను అమలు చేసి కాంగ్రెస్ ను వీడాలని వారు స్కెచ్ గీసినట్టు సమాచారం.

అయితే ఈ బ్రదర్స్ ఆధ్వర్యం లోని కాంగ్రెస్ నేతలంతా వెంటనే వేరే పార్టీలో చేరాలని భావించడం లేదట.. బీజేపీ లేదా టీఆర్ఎస్ లో చేరకూడదని డిసైడ్ అయినట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కాంగ్రెస్ ను మోసం చేశామన్న భావన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో వ్యాపించకుండా ఎన్నికల వరకూ వేచి చూసి బీజేపీ తో ఒప్పందం చేసుకొని ఆ పార్టీ లో చేరడానికి యోచిస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం గా రేవంత్ కు పీసీసీ పదవి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ను చీల్చడం ఖాయమన్న అంచనాకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు సమాచారం.