Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా టీ కాంగ్రెస్ ప్లానింగ్

By:  Tupaki Desk   |   5 Nov 2020 11:15 AM IST
కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా టీ కాంగ్రెస్ ప్లానింగ్
X
ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు.. తాను నడిచి వచ్చిన పోరాటాల్ని వేరే వారు ఎవరైనా చేపడతారంటే సుతారం ఇష్టం లేదంటారు. ఉద్యమాలు చేయటం.. ఆందోళనలు నిర్వహించటం.. నిరసనలు చేపట్టటాన్ని ఆయన అస్సలు ఇష్టపడరని చెబుతారు. దీనికి తగ్గట్లే.. ఇలాంటి వాటిని ఎలా నియంత్రించాలన్న అంశంపై కేసీఆర్ కున్న పట్టు మరెవరికీ ఉందంటారు. ఈ కారణంతోనే గడిచిన ఆరేళ్లలో.. వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఆందోళనల్ని.. ఎంత సింఫుల్ గా కంట్రోల్ చేశారో ఆయన వ్యవహరించిన తీరును చూస్తే అర్థమవుతుంది

ప్రజా పోరాటాలంటేనే ఇష్టపడని సీఎం కేసీఆర్.. ఒక దశలో ధర్నా చౌక్ ను నగర శివారులోకి మార్చటానికి ప్రయత్నించటం తెలిసిందే. నగర శివారులో ఏర్పాటు చేస్తే.. నిరసనలు.. ఆందోళనలకు సంబంధించిన ప్రభావం నగరం మీద పెద్దగా పడదు. అదే జరిగితే.. ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండదు. ఈ కారణంతోనే ధర్నా చౌక్ ను అర్జెంట్ గా వేరే చోటుకు మార్చాలని ప్రయత్నించారు. కానీ.. దానిపై తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గారు.

సీఎం కేసీఆర్ కు ఏదైతే నచ్చదో.. దాన్నే అదే పనిగా చేస్తే.. ఇరిటేట్ చేసే అవకాశంతో పాటు.. ఆ ఒత్తిడిలో తప్పులు చేస్తారన్న ఆలోచనతో టీ కాంగ్రెస్ తాజాగా ప్లానింగ్ చేసింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పలు ఆందోళనలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు అంశాలపై నిరసనలు.. ఆందోళనలు చేసేందుకు వీలుగా టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

మహిళలు.. దళితులపై దాడులకు నిరసనగా ఈ నెల 7న ఇందిరా పార్కు వద్ద ధర్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 11న ఖమ్మంలో ట్రాక్టర్లతో రైతు ర్యాలీ.. 12న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు.. ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనితో వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా పోరాటాలు.. నిరసనలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఇలాంటి వాటి విషయంలో కేసీఆర్ ఎంతలా ఇరిటేట్ అవుతారో చూడాలి.