Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా టీ కాంగ్రెస్ కొత్త అస్త్రం....

By:  Tupaki Desk   |   12 Aug 2019 7:07 AM GMT
కేసీఆర్‌ కు దిమ్మతిరిగేలా టీ కాంగ్రెస్ కొత్త అస్త్రం....
X
గతేడాది డిసెంబర్‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి జంప్ అయిపోవడం, పంచాయ‌తీ ఎన్నికల్లో చతికలపడటం జరిగాయి. ఇక ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకుని కొంచెం ఊపిరి పీల్చుకుంది. మళ్ళీ స్థానిక ఎన్నికల్లో చెప్పుకోదగిన సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. కానీ ఇటీవల కాంగ్రెస్ ఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం కావడం, ఇంకొందరు నాయకులు బీజేపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకోడం కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారింది.

అలాగే బీజేపీ దూకుడు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్లేస్ తీసుకుని కేసీఆర్ కి మేమే ప్రత్యామ్నాయం అనే స్థాయికి ఎదిగేందుకు చూస్తోంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ ఓ సంచలన నిర్ణయం తీసుకుని కేసీఆర్ కి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 50 శాతం రిజర్వేషన్లు కల్పించే పనిలో టీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైన విషయం తెలిసిందే. ఇక దీన్నే కొత్త అస్త్రంగా మలుచుకుని కేసీఆర్ మీద ప్రయోగించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకి 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ...తమ పార్టీ తరుపున ఆ పని చేసేందుకు నిర్ణయించుకుంది. బలహీన వర్గాలకి కాంగ్రెస్ 50 శాతం సీట్లు ఇవ్వనుంది. త్వరలోనే అధికారికంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే డల్ గా ఉన్న కాంగ్రెస్ కేడర్ కి జోష్ ఇచ్చే నిర్ణయం కానుంది. పైగా ఇంటింటికి కాంగ్రెస్, వాడవాడలా జెండా కార్యక్రమాన్ని చేపడుతూ పార్టీ కార్యకర్తలని ఉత్సాహపరుస్తున్నారు. మున్సిపాలిటీలలో పార్టీ కార్యక్రమలు విస్తృతంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే టిక్కెట్లపై ఆశలు ఉన్న వాళ్లు, ఈ కార్యక్రమాన్ని బాగానే చేపడుతున్నారు.

అలాగే ఈనెల 20న రాజీవ్ గాంధీ 75 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి.. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించాలని నిర్ణయించారు. ఎప్పుడు ఎన్నికలోచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే బీసీలకి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల మద్ధతు కొంతవరకు దక్కొచ్చు. అలాగే ఈ నిర్ణయంతో టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టొచ్చు. అయితే ఈ రిజర్వేషన్లని కాంగ్రెస్ సరిగా అమలు చేస్తే కేసీఆర్ కి దిమ్మతిరగడం ఖాయం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో ? చూడాలి.