Begin typing your search above and press return to search.
రేవంత్ బిస్కెట్ కు పడిపోని మాణిక్యం పంచ్ అదిరిందిగా
By: Tupaki Desk | 29 Sept 2020 11:30 AM ISTమంచి మాటకారి అయితే సరిపోదు.. సమయం సందర్భం లేకుండా మాట్లాడితే అడ్డంగా బుక్ కావటం ఖాయం. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో ఆయన టైం అస్సలు బాగోవటం లేదు. ఆయనేం చేసినా.. ఎదురు తగులుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న బాధితుల్ని పరామర్శించి.. ప్రభుత్వానికి పంచ్ లు వేయాలనుకున్న ఆయనకు.. సామాన్యుడు నిలదీసి.. నిన్న ఎంపీగా ఎన్నుకోవటం మా ఖర్మ అంటూ ఫీల్ కావటంతో రేవంత్ బాగా హర్ట్ అయ్యారని చెబుతారట.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంఛార్జిగా నియమితులైన తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ మహా టఫ్ అన్న మాట వినిపిస్తోంది. మాట వరసకు చెప్పే మాటల్ని సైతం ఆయన కరెక్టు చేస్తుంటారని చెబుతున్నారు. సరదాగా అనే మాటల్ని సైతం సరిదిద్దటమే కాదు..నేతలు వేసే పొగడ్త బిస్కెట్లకు పడిపోనన్న విషయాన్ని తన తీరుతో తేల్చి చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశాల గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు రాజకీయాలకు.. తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని తేల్చేశారు. యువత గురించి ప్రస్తావన వచ్చినంతనే.. రేవంత్ కల్పించుకొని తమ ఇంచార్జి యూత్ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మాణిక్యం తనకు 45 ఏళ్లు ఉంటాయని.. తాను యూత్ కాదని.. కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్ల వరకే యూత్ అని సరిచేశారు. ఏదో మాటవరసకు అన్న మాటను సైతం చూసిచూడనట్లు ఉండకుండా సరిచేసిన వైనం రేవంత్ నోటికి తాళం వేసేలా చేసింది. అదే సమయంలో.. మాణిక్యం ఠాగూర్ అంత తేలిగ్గా కొరుకుడుపడే నేత కాదని.. చాలా టఫ్ అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి నేతల్ని ఫేస్ చేయని టీ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడో చిక్కుగా మారిందన్న మాట వినిపిస్తోంది.