Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ కోసం పరిగెత్తాను: హీరో

By:  Tupaki Desk   |   6 May 2021 8:00 PM IST
ఆక్సిజన్ కోసం పరిగెత్తాను: హీరో
X
కరోనా సెకండ్ వేవ్ ప్రబలుతున్న ఈ సమయంలో ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. కోవిడ్ మందులు, ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొంది.

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కోవిడ్ బారినపడిన వారికి సరిగా ఆక్సిజన్ లభించడం లేదని.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదనే వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అయితే ఈ పరిస్థితికి పూర్తి కారణం రాజకీయ నేతలేనని బాలీవుడ్ హీరో సునిల్ శెట్టి విమర్శలు గుప్పించారు. వాళ్లే మనల్ని ఆస్పత్రుల్లో బెడ్ల కోసం.. ఆక్సిజన్ కోసం పరుగులు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూసుకొని మంచి నేతలకు ఓటు వేయాలని వ్యాఖ్యానించడం విశేషం.

ఈ ఎన్నికల్లో గెలిచాం కదా అని పనిచేయకుండా వచ్చే ఎన్నికల కోసమే ఆలోచిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడూ ఇంతేనని సునీల్ శెట్టి విమర్శించారు. డబ్బులు ఎలా సంపాదించాలనే యావ తప్పితే ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలే వారికి లేదని అన్నారు. అలాంటి వారిని ఎన్నుకున్న వారిలో మనం కూడా ఉన్నామని సునీల్ శెట్టి వాపోయారు.

మనం ఎన్నుకున్న వారే మనల్ని ఆక్సిజన్ కోసం బెడ్ల కోసం పరుగులు తీయిస్తున్నారని ఇవేకాదు ప్రతి ఒక్కదాని కోసం మనల్ని పరిగెత్తిస్తూనే ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటు వేయాలని సునీల్ శెట్టి పిలుపునిచ్చాడు.