Begin typing your search above and press return to search.

కరోనాతో సహజీవనం.. ఇక ముందు అంతా ఇలాగే

By:  Tupaki Desk   |   28 July 2021 6:00 AM IST
కరోనాతో సహజీవనం.. ఇక ముందు అంతా ఇలాగే
X
కొవిడ్ వల్ల భారత్ సహా ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమైన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థలన్నీ అల్లకల్లోలమయ్యాయి. ఇప్పుడిప్పుడే పలు దేశాల ఎకానమీస్ గాడీలో పడుతున్నాయి. అయితే, కొవిడ్ భయమైతే జనంలో ఇంకా పోలేదని చెప్పాలి. ఫస్ట్, సెకండ్ వేర్ పూర్తి కాగా, ప్రజెంట్ థర్డ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొందరు శాస్త్రవేత్తలు కొవిడ్ అసలు పోదని అంటున్నారు. ఈ క్రమంలో కరోనాతో సహ జీవనం చేయాలి? దాని బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ఇంట్రెస్టింగ్ స్టోరీ.

కరోనా వైరస్ జనంలో సాధారణ జీవనంలో భాగమైందని ఇప్పటికే పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయమై జరిపిన పలు అధ్యయనాల ప్రకారం.. కరోనా ఇక పోదని మెజారిటీ అధ్యయనాల్లో తేలింది. అయితే, వ్యాక్సిన్ వచ్చిందని సంబురపడాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందులా సాధారణంగా అయితే తిరగరాదు. కండిషన్స్ అప్లై అనే విషయం తెలుసుకుని ముందుకు సాగాలని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. ఇందుకు రూపాంతరం చెందుతున్న కొవిడ్ వేరియంట్లే కారణం.

భారత్‌లో థర్డ్ వేవ్‌పై చర్చ జరుగుతుండగా, స్పెయిన్‌లో ఐదో వైవ్ వచ్చిందన్న వార్తలు ప్రజలను ఇంకా కలవరపెడుతున్నాయి. అయితే, మొదటి నుంచి ప్రజలు పాటిస్తున్న జాగ్రత్తలు అన్నీ పాటించాల్సిందే తప్పకుండా. అవేంటంటే.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం. కొవిడ్ అనేది జనాలు వెంటాడుతున్న మహమ్మారి అయినప్పటికీ కొన్ని విషయాల్లో మేలు చేసిందని కొందరు నిపుణులు చెప్తున్నారు. అవేంటంటే.. కొవిడ్ వల్ల ప్రజల్లో హెల్త్ పై కాన్షియస్‌నెస్ పెరిగిన మాట వాస్తవమే. విటమిన్ సీ ఫ్రూట్స్, తాజా కూరగాయాలతో పాటు పలు పోషకాలున్న ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసకుంటున్నారు. అయితే, కొవిడ్ అంతం ఇప్పుడు అనే ఎవరూ చెప్పలేకపోవడానికి గత చరిత్ర కూడా ఓ కారణం కావొచ్చని కొందరు చెప్తున్నారు.

అంటు వ్యాధులను నిర్మూలించడం అంత ఈజీ టాస్క్ కాదని గత చరిత్ర తెలుపుతుంది. పర్టికులర్ పీరియడ్ ఆప్ టైమ్ తర్వాతే వాటి అంతం జరగొచ్చు. ఇక మారుతున్న పరిస్థితులవ ల్ల డిసీజ్ ఎఫెక్ట్ చేసే కండిషన్స్ డ్రాస్టిక్ చేంజెస్ కావడం సైంటిస్టులకు అసలు అంతుపట్టని విషయంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఎంతో శ్రమించి తయారు చేసిన వ్యాక్సిన్ పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా మారుతోంది. వ్యాక్సిన్ వల్ల ఉన్న వైరస్ మరణించినప్పటికీ అంతు చిక్కని నూతన వేరియంట్లు రావడం ఆందోళనకరం.

ఇక టీకా కోసం ప్రభుత్వం మన దేశంలో దేశవ్యాప్తంగా డ్రైవ్ కండక్ట్ చేస్తోంది. కానీ, ఒకవేళ నూతన వేరియంట్లు డెల్టాను మించినవి వస్తే కష్టమే కదా.. కొవిడ్ అనేది ఎప్పటికీ అంతం కాదని, దాని బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకుంటే చాలు అది మనతోటే ఇన్ యాక్టివ్ మోడ్‌లో ఉంటుందనేది మరి కొందరి వాదన. మొత్తంగా టీకా తీసుకున్నా తీసుకోకపోయినా జనం కరోనా బారిన పడటం కామనే అనే వాదన అందరి నుంచి వినపడ్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రజలు టీకా తీసుకోవడంతో పాటు తాము తీసుకునే ఫుడ్ ఐటమ్స్ పట్ల శ్రద్ధ వహించాలి.