Begin typing your search above and press return to search.

షరీఫ్ కి సొంత దేశంలోనే మొదలైపోయింది!

By:  Tupaki Desk   |   24 Sept 2016 10:45 AM IST
షరీఫ్ కి సొంత దేశంలోనే మొదలైపోయింది!
X
అసలు అతడేమిటో - అతడి విధానాలేమిటో.. ఆ.. అతడు ఎంచుకున్న మార్గమేమిటో - అతడి ప్రసంగం వల్ల ప్రయోజనం ఏమితో అర్ధం కావడంలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై పాక్ లోనే విమర్శలు మొదలైపోయాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వంటి వేదికపై ఆయన చేసిన ప్రసంగంపై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. ఉగ్రవాదం - కశ్మీర్ లే ప్రధానాంశాలుగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగించాల్సిన విధానం అది కాదని మండిపడుతున్నాయి. షరీఫ్ అమలుచేస్తోన్న అస్పష్ట విదేశాంగ విధానంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ ఏకాకిగా మారుతున్నదని పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత సయీద్ ఖుర్షీద్ షా - షరీఫ్ పై విమర్శల వర్షం కురిపించారు.

ఐరాస వేదికగా షరీఫ్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే విమర్శలు వెళ్లువెత్తుతున్న తరుణంలో.. సొంత దేశంలో కూడా విమర్శలు మొదలైపోయాయి. కీలకమైన రక్షణ - విదేశాంగ వ్యవహారాల్లో ఏమాత్రం స్పష్టమైన విధానం లేదని, అలా ఎప్పటికప్పుడు అన్నట్లుగా వ్యవహరించడం దేశానికి ప్రమాదమని షా విమర్శించారు. అంతర్జాతీయ సమాజంలో పాక్ ఏకాకిగా మిగిలితే ఆ పాపం షారిఫ్ఫ్ ది, పాక్ విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ ది అని షా అభిప్రాయపడ్డారు. అన్నీ తెలిసినవాడని విదేశాంగ మంత్రికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, అతడిని నమ్ముకుంటే ప్రధానికి దుస్థితి తప్పదని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అమెరికన్ కాంగ్రెస్ లో జరిగిన కీలక చర్చ కూడా షరీఫ్ అవలంబిస్తున్న విధానాలే అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ అమెరికన్ కాంగ్రెస్ లో చర్చ జరగడం షరీఫ్ వైఫల్యమేనని అంటున్నారు. అలాగే, కశ్మీర్ సమస్యను కానీ, భారత్ వల్ల పాకిస్థాన్ ఎదుర్కొంటున్న సమస్యలను కానీ ఐరాసాలో ప్రస్తావించడంలో షరీఫ్ పూర్తిగా విఫలం అయ్యారని ఖుర్షీద్ షా పేర్కొన్నారు. భారత్ పై విమర్శలు చేయడంపై కాకుండా భారత్ వల్ల వస్తున్న సమస్యలను ప్రస్థావించి ఉండాల్సిందని షా అభిప్రాయపడ్డారు.