Begin typing your search above and press return to search.

కరోనా పై పోరు..భారత్ కి సంఘీభావం తెలిపిన స్విట్జర్లాండ్!

By:  Tupaki Desk   |   19 April 2020 6:00 AM IST
కరోనా పై పోరు..భారత్ కి సంఘీభావం తెలిపిన స్విట్జర్లాండ్!
X
స్విట్జర్లాండ్ కు చెందిన ఐకానిక్ మ్యాటర్ హార్న్ పర్వతాలపై భారతదేశ జాతీయ పతాకాన్ని ఆ దేశ ప్రభుత్వం ప్రదర్శించింది. కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేయడంతో పాటుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉన్నామనే భావనతోనే ఇలా చేశామని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో భారత్‌ తో మేము కూడా కలిసే ఉన్నామని సింబాలిక్ గా తెలియజేసింది.

ఈ దృశ్యాన్ని జెనీవాలో ఉంటున్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ గుర్లీన్ కౌర్ ఫొటో తీసి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4వేల 478మీటర్ల ఎత్తు జాతీయ చిహ్నాన్ని.. ఉంచి ప్రజల్లో ఐక్యతా భావం పెరిగేలా చేస్తుంది. లైట్ ప్రొజెక్షన్లు దాదాపు 800మీటర్ల ఎత్తుగా ఉండి కొద్ది వారాల నుంచి కనిపిస్తున్నాయి. స్విట్జర్లాండ్-ఇటలీ సరిహద్దులో పర్వతాలపై వెలుగుతున్న త్రివర్ణ పతాకం 4కిలోమీటర్ల దూరం వరకూ దర్శనమిస్తుంది.

ఇండియా తో పాటుగా కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్న అమెరికా, జర్మనీ, స్పెయిన్, యూకే, జపాన్ జాతీయపతాకాలు కూడా ఈ పర్వతం పై ప్రదర్శించారు. దీనిపై ఆ దేశ అధికారులు మాట్లాడుతూ ..స్విస్ పతాకంతో దీన్ని మొదలుపెట్టాం. ఎందుకంటే మా జాతీయ పతాకంతో అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వాటిని ఆశ - నమ్మకం - ఇంట్లోనే ఉండడం వంటి పదాలతో అందరిలో నమ్మకం పుట్టిస్తున్నాం అని తెలిపారు.