Begin typing your search above and press return to search.

చైనాలో కరోనా.. మనకు ఈ మహమ్మారి భయం.!

By:  Tupaki Desk   |   20 Feb 2020 11:30 PM GMT
చైనాలో కరోనా.. మనకు ఈ మహమ్మారి భయం.!
X
చైనాను ‘కరోనా’ వైరస్ భయపెడుతుంటే.. తెలుగు రాష్ట్రాలను ‘స్వైన్ ఫ్లూ’ వదలడం లేదు. పంది నుంచి వ్యాపించిన ఈ వ్యాధి దేశవిదేశాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో తిష్టవేసి ప్రతీ చలికాలంలోనూ పెచ్చరిల్లుతూ జనాల్ని కబలించేస్తోంది.

10 ఏళ్ల కిందటే వెలుగుచూసిన ఈ స్వైన్ ఫ్లూ మహమ్మారి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రతాపం చూపిస్తూనే ఉంది.కొన్ని రోజులుగా చలితీవ్రత పెరగడంతో ఈ వ్యాధి కూడా వ్యాపిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గితే స్వైన్ ఫ్లూ పెరుగుతోంది.

హైదరాబాద్ లో మరోసారి స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి లో ఇద్దరికీ స్వైన్ ఫ్లూ చికిత్స జరుగుతుండడం కలకలం రేపుతోంది. మరో ఐదుగురు అనుమానితులకు లక్షణాలు గుర్తించారు.

చలి గాలులతో ఈ స్వైన్ ఫ్లూ వైరస్ వాతావరణంలో కలిసి ఇప్పటికే ఈ ఏడాది 63మందికి సోకింది. ఇందులో ఐదుగురు మరణించడం విషాదం నింపింది. జనవరి నుంచి ఇప్పటి దాకా 30మందికి సోకింది. ఐదేళ్లలోపు నుంచి 60 ఏళ్ల పైబడిన ముసలివాళ్లు,గర్భిణులు, ఆస్తమా రోగులు, క్యాన్సర్ పేషెంట్లకు వ్యాధి త్వరగా సోకి కబలిస్తోంది. స్వైన్ ఫ్లూ అంటేనే హైదరాబాద్ లో జనాలు హడలిచస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఏటా ఈ వైరస్ మరణ మృందంగం వినిపిస్తోంది.