Begin typing your search above and press return to search.

కోయంబత్తూర్ వీధుల్లో స్వీడిష్ పారిశ్రామికవేత్త భిక్షాటన

By:  Tupaki Desk   |   19 Feb 2020 12:59 PM IST
కోయంబత్తూర్ వీధుల్లో స్వీడిష్ పారిశ్రామికవేత్త భిక్షాటన
X
కోయంబత్తూర్ వీధుల్లో ఒక విదేశీ మహిళ చేతులు జోడించి.. భిక్షాటన చేస్తున్న వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆ మధ్యలో వచ్చిన తమిళ డబ్ మూవీ బిచ్చగాడు సినిమాను గుర్తుకు వచ్చే ఉదంతం ఇప్పుడు దర్శనమిస్తోంది. మానసిక ప్రశాంతత కోసం కోయంబత్తూర్ కు వచ్చిన స్వీడన్ కు చెందిన మహిళ వీధుల్లో అడుక్కోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్వీడన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళ ఒక పారిశ్రామికవేత్త. కొద్ది నెలల క్రితం ఆమె కోవైలోని ఈషాయోగా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి బడుగు.. బలహీన వర్గాలకు చెందిన వారికి తనకు తోచిన సాయం చేస్తున్నారు. అయినా.. తాను కోరుకున్న మానసిక ప్రశాంతత లభించని ఆమె.. కోవై వీధుల్లో భిక్షాటన చేయటం షురూ చేశారు. ఆమె ఎందుకు భిక్షాటన చేస్తుందో కారణం తెలీటం లేదు.

వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారికి రెండు చేతులతో నమస్కరిస్తున్న ఆమెకు.. ఐదు.. పది రూపాయిలు ఇస్తున్నారు అక్కడివారు. సంపన్నమైన ఆ మహిళ ఇలా ఎందుకు భిక్షాటన చేస్తున్నారో అర్థం కావటం లేదని చెబుతున్నారు. ఒక సంపన్న విదేశీ మహిళ ఇలా వీధుల్లో భిక్షాటన చేయటం స్థానికంగా సంచలనంగా మారింది.