Begin typing your search above and press return to search.
గుంటూరు జైలు భరో.. పోలీసులకు చుక్కలు చూపించిందిగా?
By: Tupaki Desk | 1 Nov 2020 11:00 AM ISTచిన్న వివాదం.. పెద్ద ఇష్యూగా మార్చటంలో కొందరి అధికారుల తొందరపాటు ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న ఆందోళన.. రచ్చను తరచి చూస్తే.. కొందరు అధికారుల అత్యుత్సాహం ఇష్యూ సున్నితంగా మారటమే కాదు.. ప్రజల భావోద్వేగాల్ని టచ్ చేసేలా ఉంటుంది. గుంటూరులో నిర్వహించిన జైల్ భరో దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ మూడు వందల రోజులకు పైగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనికి పోటీగా.. మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళన చేసేందుకు కొందరు ప్రయత్నించటం.. వారిని అడ్డుకునే వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది.
ఈ ఎపిసోడ్ లో కేసులు నమోదు చేసి.. కోర్టుకు తీసుకురావటం.. వారికి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవటం జరిగిపోయాయి. కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో రాజధాని రైతుల చేతులకు బేడీలు వేసిన తీరు ఆగ్రహానికి గురి చేసేలా చేయటమే కాదు.. భావోద్వేగాల్ని టచ్ చేసింది. పోలీసుల తీరుకు నిరసనగా శనివారం గుంటూరులో జైలుభరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అమరావతి ఐకాస.. రాజధాని పరిరక్షణ సమితి నేతలు ఉమ్మడిగా ఇచ్చిన ఈ పిలుపును భగ్నం చేసేందుకు వీలుగా పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
రాజధాని అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల్లో వందలాది మంది పోలీసుల్ని దించటమే కాదు.. గుంటూరు నగరంలోనూ పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. సాధారణంగా జైలు భరో.. ముట్టడి లాంటి కార్యక్రమాలకు యూత్ తో పాటు.. ప్రజా సంఘాలకు చెందిన మహిళలు కనిపిస్తుంటారు. అందుకు భిన్నంగా తాజా జైలు భరో కార్యక్రమానికి ఆరేళ్ల చిన్నారులు మొదలు అరవైఏల్ల పెద్ద వయస్కులు రోడ్ల మీదకు రావటం.. అరుదైన సీన్ గా చెప్పక తప్పదు.
పోలీసుల ఆంక్షల్ని దాటుకొని జైలు వరకు వెళ్లగలగటమే కాదు.. జైలు లోపలకు వెళ్లే ప్రయత్నం చేయటం పోలీసులకు విస్మయాన్ని రేకెత్తించటంతోపాటు.. టెన్షన్ పుట్టించింది. జై అమరావతి నినాదంతో పాటు.. పోలీసుల చర్యల్ని తప్పు పడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యూహాత్మకంగా నిర్వహించిన ఈ జైలు భరోలో తొలుత ఒకరిద్దరితో మొదలైనా.. చూస్తుండగానే వందలాది మంది రోడ్ల మీదకు రావటంతో.. పోలీసులకు దిక్కుతోచని పరిస్థితి.
ఏ వైపు నుంచి ఎవరు వస్తారన్నది అంచనా వేయటానికి వీల్లేని రీతిలో ఆందోళకారులు వ్యవహరించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు గుంటూరు పోలీసులు చెమటలు చిందించాల్సి వచ్చింది. దీంతో జైలు పరిసరాలు రణరంగాన్ని తలపించేలా మారాయి. పోలీసుల వలయాన్ని ఛేదించి.. జైలుభరోను విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున మహిళలు రావటం.. గతంలో ఎప్పుడూ చూడని వర్గాల వారు రావటంతో పోలీసులకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.
అనధికార లెక్కల ప్రకారం జైలు భరోలో వెయ్యి మంది వరకుపాల్గొన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జైలుభరోలోపాల్గొన్న వారిలో 150 మందిని తాము అదుపులోకి తీసుకున్నామని.. వారిపై కేసులు నమోదు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ విధించిన రైతుల చేతులకు బేడీలు వేయకుంటే.. అసలీ రచ్చే జరిగేది కాదు కదా? అన్నది ప్రశ్న. అయితే.. ఈ చర్యకు పాల్పడిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ.. అక్కడితో సరిపోదు కదా. ఇలాంటి పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంటాయని చెప్పక తప్పదు.