Begin typing your search above and press return to search.

తన ముఖం ఎందుకు వెలిగి పోతుందో సీక్రెట్ చెప్పిన మోడీ

By:  Tupaki Desk   |   25 Jan 2020 9:42 AM IST
తన ముఖం ఎందుకు వెలిగి పోతుందో సీక్రెట్ చెప్పిన మోడీ
X
ఓపక్క దేశంలో పౌరసత్వ సవరణ చట్టం మీద పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు జరుగుతున్న వేళ.. వాటినే మాత్రం పట్టించుకోని రీతిలో ప్రధాన మంత్రి మోడీ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. తన ముఖం ఇంతలా వెలిగి పోవటానికి కారణం తెలుసా? అని ప్రశ్నించిన ఆయన.. దానికి సంబంధించిన రహస్యాన్ని తొలిసారి షేర్ చేశారు? ఇంతకీ.. ప్రధాని మోడీ ఏమిటి? ఆయన ముఖం అంత గ్లో గా ఉండటానికి కారణం ఎవరికి చెప్పారన్న సందేహం కలిగిందా? అక్కడికే వస్తున్నాం.

జనవరి 26 న నిర్వహించే గణతంత్ర వేడుకలు ఈసారి ఆదివారం వస్తున్నాయి. సాధారణంగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జాతీయ బాలల అవార్డుల్ని ప్రకటిస్తుంటారు. వివిధ రంగాల్లో ధైర్య సాహసాలు కనపర్చిన బాలల్ని ఈ అవార్డులతో సత్కరిస్తారు. ఈ ఏడాది ఈ పురస్కారానికి 49 మంది పిల్లలు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా వారితో ప్రత్యేకం గా భేటీ అయ్యారు ప్రధాని మోడీ. వారితో కాసేపు మాట్లాడారు. జీవిత పాఠాల్ని బోధించారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ.. చాలా ఏళ్ల క్రితం తనను కొందరు కలిసి ఒక ప్రశ్న అడిగారని.. అదేమంటే.. మీ ముఖం ఇంత ప్రకాశవంతంగా వెలిగి పోవటానికి కారణం ఏమిటి? అని. దానికి తాను వారికి చెప్పింది ఒక్కటేనని.. కష్టపడి పని చేయటం..అందు కోసం చెమట చిందిస్తానని.

కష్టపడి పని చేస్తే ముఖానికి మసాజ్ చేసినట్లు అవుతుందని.. అందుకే తన ముఖం వెలిగిపోతుందని చెప్పారు. అందుకే రోజుకు కనీసం నాలుగైదుసార్లు తాను చెప్పినట్లుగా కష్టపడి పని చేయాలన్నారు. ఎన్ని అవార్డులు పొందామన్నది ముఖ్యం కాదని.. ఎంత కష్ట పడుతున్నా మన్నది ముఖ్యమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మాటల మధ్య లో మీకు హక్కులు ముఖ్యమా? బాధ్యతలు ముఖ్యమా? అని ప్రశ్నించగా.. అక్కడున్న చిన్నారులు బాధ్యతలు అని సమాధానం ఇవ్వటం తో.. అయితే ఇప్పుడే దీనిని చట్టం గా తీసుకొస్తానని వ్యాఖ్యానించటం విశేషం. ఇలా తన ముఖం వెలిగి పోవటం వెనుకున్న సీక్రెట్ ను మోడీ తనదైన శైలి లో రివీల్ చేశారని చెప్పక తప్పదు.