Begin typing your search above and press return to search.
బండి సంజయ్ దమ్మున్న నాయకుడు : స్వామి గౌడ్
By: Tupaki Desk | 27 Nov 2020 11:15 AM ISTకేసీఆర్ దర్శనభాగ్యం దక్కక.. విసిగి వేసారి ఆత్మాభిమానం కోసం బీజేపీలో చేరానన్న టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లోని లోటుపాట్లను .. బీజేపీలోని బలాన్ని ఆయన ఎత్తిచూపారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలను ఆయన వల్లెవేశారు.
ప్రతి ఇంట్లో ముగ్గురు పిల్లలను కనండి.. ఆ మధ్య శాసన మండలి చైర్మన్ గా ఉండి ఇదేమాట అంటే రచ్చ చేశారని స్వామి గౌడ్ అన్నారు అదేమాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. దంపతుల్లారా ముగ్గురు పిల్లలు కనండి అని స్వామి గౌడ్ పిలుపునిచ్చారు.
కౌన్సిల్ చైర్మన్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారని... నీకేం తక్కువ చేశారని చాలామంది అంటున్నారని స్వామిగౌడ్ తెలిపారు. నన్నేం రోడ్డు మీద ఉంటె తీసుకొచ్చి చైర్మన్ చేయలేదని స్వామి గౌడ్ కౌంటర్ ఇచ్చారు.. కొత్త బట్టలు కొనిచ్చాను ముడ్డిమీద తంతా పడు అంటే ఎలా పడతాను అని హాట్ కామెంట్స్ చేశారు.. రెండుసార్లు పోలీసులు తనను చంపడానికి ప్రయత్నించారని, ఆత్మాభిమానం లేని ఏ పదవి తనకు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు..
రెండేళ్ల నుంచి రెండు నిమిషాల టైమ్ కూడా కేసీఆర్ తనకు ఇవ్వలేదని స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను తండ్రిలా భావించానని, చెప్పుడు మాటలు విని తనను దూరంగా పెట్టారని అన్నారు. పార్టీని, కేసీఆర్ ని తిట్టి, తొడలు కొట్టిన వారికీ, పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారని ఆరోపించారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చేయి వేస్తె నీ దారుస్సలాం పగులగొడతా అని చెప్పిన దమ్మున్న మొనగాడు బండి సంజయ్ అని, పార్టీకి అటువంటి బలమైన నాయకత్వం కావాలని అన్నారు స్వామిగౌడ్.