Begin typing your search above and press return to search.

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్: తొలి స్థానంలో ఇండోర్‌ .. మూడో స్థానంలో విజ‌య‌వాడ‌

By:  Tupaki Desk   |   20 Nov 2021 11:35 AM GMT
స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్: తొలి స్థానంలో ఇండోర్‌ .. మూడో స్థానంలో విజ‌య‌వాడ‌
X
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2021’ అవార్డులు ప్ర‌క‌టించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా ఐదో సారి ఇండోర్‌ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవ‌డం విశేషం. గత నాలుగేళ్లుగా దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ మొదటిస్థానంలో నిలుస్తూ వస్తున్న ఇండోర్..ఇప్పుడు ఐదోసారి పరిశుభ్రమైన నగరంగా నలిచింది.

ఇండోర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవ‌డం ఇది అయిదోసారి విశేషం. రెండో స్థానంలో సూర‌త్‌ (గుజరాత్), ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2021’ అవార్డులను శనివారం ప్ర‌క‌టించింది. విజేతలకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రదానం చేశారు.

కాగా ఇండోర్ సాధించిన విజయానికి నగర ప్రజలకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ఇండోర్ నగరాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదవసారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు. పౌరులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది అని కలెక్టర్ మనీష్ సింగ్ ట్వీట్‌ చేశారు. అంతేగాక ఇంతకుముందు దేశంలోనే తొలి వాటర్‌ ప్లస్‌ నగరంగా ఇండోర్‌ నిలిచింది. ఇదిలా ఉండగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్‌ లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన వార్షిక సర్వే.

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్-2021లను శనివారం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను విజేతలకు అందించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్ గఢ్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక,స్వచ్ఛమైన గంగా నగరంగా వారణాసికి అవార్డు లభించింది.