Begin typing your search above and press return to search.

‘స్వచ్ఛ నగరాల్లో’ బీజేపీని బీట్ చేసిన కాంగ్రెస్?

By:  Tupaki Desk   |   16 Feb 2016 4:12 AM GMT
‘స్వచ్ఛ నగరాల్లో’ బీజేపీని బీట్ చేసిన కాంగ్రెస్?
X
మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం తెలిసిందే. దేశ రూపురేఖల్ని మార్చేసే ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టటం.. ఇందుకోసం భారీ ప్రచారాన్ని నిర్వహించటం తెలిసిందే. స్వచ్ఛభారత్ అంటూ నినదిస్తున్న బీజేపీ.. తాము అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కానీ.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్ని ఎంతమేర స్వచ్ఛంగా ఉన్నాయన్న విషయం చూస్తే విస్మయం కలగక మానదు. పరిశుభ్ర నగరాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా 73 నగరాల్లో సర్వే నిర్వహిస్తే.. బీజేపీని కాంగ్రస్ బీట్ చేయటం ఒక విశేషమైతే.. స్వచ్ఛతకు పెద్దపీట వేసే పెద్ద మనిషి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నగరం ఎక్కడో చివరన ఉంటే.. అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని మైసూర్ పట్టణం పరిశుభ్ర నగరం ఫస్ట్ ప్లేస్ సాధించటం గమనార్హం.

వరుసగా రెండో ఏడాది నిర్వహించిన పరిశుభ్రత నగరాల పోటీలో మోడీ.. కేసీఆర్ కంటే బాబు పాలనలో ఉన్న విశాఖపట్నం మెరుగైన స్థానాన్ని సాధించి.. టాప్ ఫైవ్ లో ఉండటం గమనార్హం. హుధూద్ తుఫానుతో అతలాకుతలమైన విశాఖ నగరం కోలుకోవటమే కాదు.. పరిశుభ్ర నగరంగా టాప్ ఫైవ్ లో నిలవటం విశేషంగా చెప్పాలి.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ‘స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే – 2016’ పేరిట దేశంలోని 73 నగరాల్లో పరిశుభ్రతపై సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా విడుదలయ్యాయి. వీటి వివరాలు చూస్తే..

టాప్ 15 నగరాలు..

1. మైసూర్ (కర్ణాటక)

2. చండీగఢ్

3. తిరుచిరాపల్లి (తమిళనాడు)

4. ఢిల్లీ కార్పొరేషన్ (ఢిల్లీ)

5. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)

6. సూరత్ (గుజరాత్)

7. రాజ్ కోట్ (గుజరాత్)

8. గ్యాంగ్ టక్ (సిక్కిం)

9. పింప్రి-చింద్ వాడా (మహారాష్ట్ర)

10. గ్రేటర్ ముంబయి (మహారాష్ట్ర)

11. పుణె (మహారాష్ట్ర)

12. నవీ ముంబయి (మహారాష్ట్ర)

13. వడోదర (గుజరాత్)

14. అహ్మాదాబాద్ (గుజరాత్)

15. ఇంఫాల్ (మణిపూర్)

16 – 35 ర్యాంకుల్లో ఉన్న తెలుగు నగరాలు

= హైదరాబాద్ (19వ ర్యాంక్)

= విజయవాడ (23వ ర్యాంక్)

= వరంగల్ (32వ ర్యాంక్)

అత్యంత తక్కువ పరిశుభ్రత కలిగిన టాప్ 10 నగరాలు

= ధన్ బాద్ (జార్ఖండ్)

= అసన్ సోల్ (పశ్చిమబెంగాల్)

= ఇటానగర్ (అరుణాచల్ ప్రదేశ్)

= పాట్నా (బీహార్)

= మీరట్ (ఉత్తర్ ప్రదేశ్)

= రాయపూర్ (ఛత్తీస్ గఢ్)

= ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్)

= జంషెడ్ పూర్ (జార్ఖండ్)

= కల్యాణ్ (మహారాష్ట్ర)

= వారణాసి (ఉత్తర్ ప్రదేశ్)

గత సర్వేతో పోలిస్తే స్థానాలు మెరుగుపర్చుకున్న నగరాలు

= విశాఖపట్నం (39 స్థానాల మెరుగు)

= మైదరాబాద్ (31 స్థానాలు మెరుగు)

= విజయవాడ (23 స్థానాల మెరుగు)

గత సర్వేతో పోలిస్తే దిగజారిన నగరాలు

= జంషెడ్ పూర్

= కొచ్చి

= షిల్లాంగ్

= చెన్నై

= గువాహటి

= నాసిక్