Begin typing your search above and press return to search.

స్వ‌చ్ఛ‌భార‌త్ ర్యాంకు: విశాఖ 3..భాగ్య‌న‌గ‌రి 22

By:  Tupaki Desk   |   4 May 2017 10:36 AM GMT
స్వ‌చ్ఛ‌భార‌త్ ర్యాంకు: విశాఖ 3..భాగ్య‌న‌గ‌రి 22
X
మోడీ మాన‌స‌పుత్రిక స్వ‌చ్ఛ‌భార‌త్. దేశాన్ని శుభ్రంగా ఉంచాల‌న్న మ‌హా సంక‌ల్పాన్ని ఒక ఉద్య‌మంగా ప్ర‌ధాని మోడీ స్టార్ట్ చేయ‌టం తెలిసిందే. ఈ ఉద్య‌మానికి కొన‌సాగింపుగా.. దేశ వ్యాప్తంగా ఉన్న న‌గ‌రాల్ని శుభ్రంగా ఉంచే న‌గ‌రాల‌కు ర్యాంకులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది ర్యాంకుల్ని వెల్ల‌డించారు. స్వ‌చ్ఛ‌భార‌త్ స‌ర్వేక్ష‌న్ ఈ ర్యాంకుల్ని ప్ర‌క‌టించింది.

ఈ ర్యాంకుల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన ఇండోర్ స్వ‌చ్ఛ‌భార‌త్ మొద‌టి ర్యాంకును సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో భోపాల్ నిలిచింది. మూడో స్థానంలో ఏపీలోని విశాఖ‌ప‌ట్నాన్ని ఎంపిక చేశారు. న‌గ‌రాల్లో ఉండే మౌలిక స‌దుపాయాలు.. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌.. బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న శాల‌ల ఏర్పాటు.. ఇళ్ల‌ల్లో మ‌రుగుదొడ్ల నిర్మాణం లాంటి అంశాల ప్రాతిప‌దిక‌న ర్యాంకుల్ని డిసైడ్ చేస్తారు. తాజాగా ఈ ర్యాంకుల్ని ప్ర‌క‌టించారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే గ‌త రెండేళ్ల‌లో స‌ర్వేల్లో తొలి ర్యాంకు సాధించిన మైసూర్ ఈసారి ఐదో ర్యాంకుకు ప‌రిమితం కాగా.. ఏపీకి చెందిన రెండు ప‌ట్ట‌ణాలు టాప్ టెన్ స్థానంలో నిలిచాయి. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం టాప్ 22కు ప‌రిమితం విశేషం.

మ‌రో చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. టాప్ 50లో ఏపీకి చెందిన 8(విశాఖపట్నం(3) - తిరుపతి(9) - విజయవాడ (19) - తాడిపత్రి (31) - నర్సరావుపేట(40) - కాకినాడ (43) - తెనాలి (44) - రాజమండ్రి(46) ) ప‌ట్ట‌ణాలకు చోటు ల‌భిస్తే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగు (హైద‌రాబాద్‌(22) - వ‌రంగ‌ల్‌(28).. సూర్య‌పేట‌(30).. సిద్ధిపేట‌(45) మాత్ర‌మే చోటు ద‌క్కించుకున్నాయి. త‌ర‌చూ త‌మ‌ది సంప‌న్న రాష్ట్రమ‌ని.. హైద‌రాబాద్ సంప‌న్న న‌గ‌రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. స్వ‌చ్ఛ‌భార‌త్ ర్యాంకుల విష‌యంలో వెనుక‌బ‌డిన వైనానికి ఏమంటారో?

మ‌రోవైపు యూపీలోని గోండా పట్టణం స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితాలో 434వ ర్యాంకుతో చివరి స్థానంలో నిలిచింది. ఇక‌.. ప్ర‌ధాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి 32వ ర్యాంకులో నిలిచింది.

టాప్ టెన్ ర్యాంకుల్ని చూస్తే..

1. ఇండోర్‌

2. భోపాల్‌

3.విశాఖ‌ప‌ట్నం

4. సూరత్‌

5. మైసూర్‌

6. తిరుచురాపల్లి

7. న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌

8. నవీ ముంబయి

9. తిరుపతి

10.వడోదర

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/