Begin typing your search above and press return to search.
అదిరే ఫీచర్లతో సుజుకీ హయబుసా బైక్.. భారత్లో త్వరలో లాంచ్
By: Tupaki Desk | 11 April 2021 8:49 AM ISTఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ గురించి భారతీయులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ కంపెనీ తయారు చేసే బైక్ లకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఈ జపాన్ దిగ్గజ కంపెనీ తయారు చేసే ద్విచక్రవాహన ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. సుజుకీ హయబుసా మోడల్ ను రూపొందించింది. చూడడానికి మతిపోయోలా ఉన్న ఈ బైక్ కోసం బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు.
సుజుకీ రూపొందించిన హయబుసాను త్వరలో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ఈ బైక్ కు సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేసింది. తన మొదటి జనరేషన్ బైక్ ను 1998 లో లాంచ్ చేసింది. 2007లో అది మార్కెట్ లో అందుబాటులో ఉంది. రెండో జనరేషన్ బండిని 2008లో తయారుచేసింది. ఆ బైక్ కి ఇండియాలో మంచి క్రేజ్ దక్కింది.
మూడో జనరేషన్ బైక్ ను త్వరలో లాంచ్ చేయనుంది. హయబుసా చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది. అదిరే లుక్కుతో ఉంది. ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు రైడర్లు. పెద్ద విండ్ స్క్రీన్ ను కలిగిఉంది. గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, క్యాండీ, గోల్డ్ కలర్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. 1450 సీసీ ఇంజిన్ ను కలిగిఉంది. 200 హెచ్పీ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక 6 గేర్ బాక్స్ ఉంది.
సుజుకి హయబుసా స్పోర్ట్ బైక్ కి మంచి డిమాండ్ ఉంది. అత్యధిక వేగం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో రైడర్లు చాలా ఆసక్తి కనబర్చుతున్నారు. ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుందనే కారణంతో చాలా దేశాల్లో దీనిని నిషేధించారు. ఈ అద్భుతమైన ఫీచర్లతో హయబుసా మార్కెట్ లోకి రానుంది. అయితే లాంచ్ అయిన తర్వాత మరికొన్ని ప్రత్యేకతలు తెలుస్తాయని సుజుకీ ప్రతినిధులు అంటున్నారు.