Begin typing your search above and press return to search.

పట్టపగలు లాలూ అల్లుడి కారునే ఎత్తుకెళ్లారే

By:  Tupaki Desk   |   4 Feb 2016 6:28 AM GMT
పట్టపగలు లాలూ అల్లుడి కారునే ఎత్తుకెళ్లారే
X
బీహార్ ప్రభుత్వానికి వెన్నుముకగా ఉన్న ఆర్జేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి సంబంధించి చోటు చేసుకున్న ఉదంతం ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. లాలూ లాంటి శక్తివంతమైన రాజకీయ నాయకుడి అల్లుడి కారును పట్టపగలు..దొంగలు ఎత్తుకెళ్లటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తుపాకీలు ఎక్కు పెట్టి డ్రైవర్ ను బెదిరించి దొంగలించిన ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా దృష్టి సారించింది.

ఇక.. ఈ దొంగతనానికి సంబంధించిన వివరాలు చూస్తే.. లాలూ ఐదో అల్లుడు వినీత్ యాదవ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం గుర్ గావ్ కి వెళ్లారు. అక్కడ పని పూర్తి చేసుకున్న అతగాడు సికిందర్ పూర్ చేరుకొని.. అక్కడ కారు దిగారు. కారు పార్క్ చేసే సమయంలో గుర్తు తెలియని ఇద్దరువ్యక్తులు తుపాకులు చూపిస్తూ.. కారును వదిలేయాలని బెదిరించాడు. అందుకు కారు డ్రైవర్ నిరాకరిస్తుండగా.. అతడిపై దాడికి తెగబడే ప్రయత్నం చేశారు.

తుపాకీలు ఎక్కుపెట్టి డ్రైవర్ వద్దనున్న తాళాలు తీసుకొని కారుతో ఇద్దరు దొంగలు ఉడాయింటం కలకలాన్ని రేపుతోంది. పట్టపగలు.. అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.