Begin typing your search above and press return to search.

కరోనా భాదితుడికి చికిత్స అందించిన నర్సుకి సోకిన వైరస్ ... ?

By:  Tupaki Desk   |   13 March 2020 12:45 PM IST
కరోనా భాదితుడికి చికిత్స అందించిన నర్సుకి సోకిన వైరస్ ... ?
X
ప్రస్తుతం మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనామహమ్మారి భారత్‌ ను వణికిస్తోంది. చైనాలోని వూహాన్ సిటీలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. దీంతో చాలా దేశాల్లో అక్కడి ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇక ఈ వైరస్ హైదరాబాద్‌ను కూడా కొన్ని రోజుల క్రితం తాకిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతనికి వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కర్నాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

కర్నాటకలోని కాలాబురగీకి చెందిన 76 ఏళ్ల మొహ్మద్ హుస్సేన్ సిద్దిఖీని బీదర్ నుంచి హైదరాబాద్‌ కు తరలించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పుడుతున్నాడని తెలుసుకున్న వైద్యులు కరోనా వైరస్ పరీక్షల కోసం శాంపిల్స్ పంపగా అతనికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. దీనితో ఆయన్ను ఓ ఎమర్జెన్సీ గదిలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే , 76 ఏళ్ల మొహ్మద్ హుస్సేన్ మంగళవారం రోజున అతను మృతి చెందాడు. కరోనా తో భారత్ లో మృతి చెందిన మొదటి వ్యక్తి ఈయనే.

ఈ నేపథ్యంలో అయితే గురువారం రోజున తెలంగాణ వైద్యాధికారులు హుస్సేన్ మృతి చెందిన ప్రైవేట్ హాస్పిటల్‌ కు చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఐసొలేషన్ వార్డు లో ఆయనకి నర్సింగ్ కేర్ ఇచ్చిన నర్సును కూడా ప్రతిరోజు వైద్యులు పర్యవేక్షించాలని కోరారు. ప్రస్తుతానికి ఆ నర్సుకి కరోనా లక్షణాలు ఏవి లేనప్పటికీ ... భవిష్యత్తులో సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరించారు. ఇకపోతే , భారత్‌ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 కి పైగా చేరుకుంది.