Begin typing your search above and press return to search.

నాలుగు కుటుంబాలు గీత తమ బిడ్డే అంటున్నారు

By:  Tupaki Desk   |   9 Aug 2015 5:54 AM GMT
నాలుగు కుటుంబాలు గీత తమ బిడ్డే అంటున్నారు
X
ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయిజాన్ లో పాక్ కు చెందిన ఒక చిన్నారి తప్పిపోయి ఇండియాకు రావటం.. హీరో ఆమెను పాకిస్థాన్ కు తీసుకెళ్లి ఆమె తల్లిదండ్రులకు అప్పగించటం తెలిసిందే.

సరిగ్గా ఇలాంటిదే రియల్ ఘటన వెలుగులోకి రావటం తెలిసిందే. కాకపోతే.. సినిమాకు కాస్త రివర్స్ గా.. గీత అనే అమ్మాయి భారత్ నుంచి పాక్ కు తప్పిపోయి వెళ్లి.. కొన్నేళ్లుగా అక్కడ ఉంటోంది. ఆమె కోసం ఎన్నో ప్రయత్నాలు సాగినప్పటికీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. తాజాగా భజరంగీ బాయిజాన్ చిత్రం పుణ్యమా అని గీత అంశం వెలుగులోకి రావటం.. దీనిపై విదేశాంగ శాఖ దృష్టి పెట్టటంతో.. దేశవ్యాప్తంగా పాక్ లోని గీత సంగతి ప్రతిఒక్కరికి తెలిసేలా చేసింది.

దీంతో.. ఆమె తల్లిదండ్రుల వేట మొదలైంది. అయితే.. ఆమె తమ కుమార్తె అంటూ ఇప్పటికి నాలుగు కుటుంబాలు కేంద్రాన్ని సంప్రదించాయి. వీరిలో.. ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్ రాజ్ గౌతమ్.. అనరా దేవి ల వాదన ఆసక్తికరంగా ఉంది.

తమ కుమార్తె సవిత 2004లో తప్పిపోయిందని చెబుతున్నారు. వారి కుమార్తె కు సంబంధించిన వివరాల్ని విదేశాంగ శాఖ సేకరిస్తోంది. మరోవైపు.. గీతను భారత్ కు రప్పించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక.. గీత తమ కుమార్తె గా పేర్కొంటూ ముందుకొచ్చి నలుగురు (ఉత్తరప్రదేశ్..పంజాబ్.. బీహార్.. జార్ఖండ్) కుటుంబాలకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ లేఖ రాశారు. వారి కుటుంబాల గురించి పక్కా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. చూస్తుంటే గీత తల్లిదండ్రులు త్వరలోనే తలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.