Begin typing your search above and press return to search.
పాక్ ప్రధానికి చెప్పుతో సమాధానమిచ్చిన సుష్మా!
By: Tupaki Desk | 25 Sept 2016 10:09 PM ISTభారతదేశ సైనికులను హతమర్చిన పాక్ పై ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు ఎంతగా మండిపడుతున్నారో సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటో ప్రకారం సుష్మా చెప్పుతో ఉండటం, దాన్ని పాకిస్తాన్‌కు లింక్ పెట్టడంతో వైరల్‌గా మారింది.
సామాజిక మాధ్యమం ట్విటర్‌లో చెలామణిలో ఉన్న ఈ ఫొటోలో చేతిలో తన కాలి చెప్పు పట్టుకుని సుష్మా పరిశీలిస్తున్నారు. సుష్మా ఉన్న ఈ ఫొటోను పోస్ట్ చేసి దానికింద "పాకిస్తాన్ ప్రధాని ప్రసంగానికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్న మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్" అని పేర్కొన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాకిస్తాన్‌కు, ఆ దేశ ప్రధానమంత్రికి సమాధానం చెప్పేందుకు ఇలా చెప్పు ఉపయోగించడమే సరైన సమాధానమని పలువురు వ్యాఖ్యానిస్తుండగా... ఇలా కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా భారతదేశం వ్యవహరించకపోవడమే పొరుగుదేశం బరితెగింపునకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.