Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధిష్టానంపై.. మ‌రో సీనియ‌ర్ ఫైర్‌!

By:  Tupaki Desk   |   2 July 2021 2:30 AM GMT
కాంగ్రెస్ అధిష్టానంపై.. మ‌రో సీనియ‌ర్ ఫైర్‌!
X
అధికారం ఉంటేనే రాజ‌కీయ పార్టీల‌కు గుర్తింపు. లేదంటే.. సొంత పార్టీ నేత‌లే లైట్ తీసుకుంటారు అని చెప్ప‌డానికి కాంగ్రెస్ రాజ‌కీయాలే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. 2004 నుంచి 2014 వ‌ర‌కు సోనియా, రాహుల్ హ‌వా కొన‌సాగింది. వారి ముందు ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌టానికి కూడా ఇత‌ర నేత‌లు జంకేవారు. కానీ.. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

రెండు ద‌ఫాలుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ అధిష్టానానికి.. సీనియ‌ర్ల నుంచే స‌హ‌కారం ల‌భించ‌ట్లేదు. జీ24గా ఏర్ప‌డిన సీనియ‌ర్ నేత‌లు.. ప్ర‌తీ కీల‌క స‌మ‌యంలో అధిష్టానంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. అది కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో మీటింగులు పెట్టుకొని, అంతిమంగా బీజేపీకి ల‌బ్దిచేకూరేలా మాట్లాడుతూ వ‌స్తుండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

అయితే.. పార్టీకి, అధిష్టానానికి విధేయుడిగా చెప్పుకునే సీనియ‌ర్ నేత సుశీల్ కుమార్ షిండే కూడా ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పూణెలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ఆయ‌న‌.. పార్టీలో సంప్ర‌దాయాలు క‌నుమ‌రుగైపోయాయ‌ని అన్నారు.

పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు లేవ‌ని, మాట్లాడుకోవ‌డం కూడా లేద‌ని అన్నారు. పార్టీ విధానాల్లో చాలా త‌ప్పులు ఉన్నాయ‌ని, వాటిని స‌వ‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకోసం స‌మావేశాలు నిర్వ‌హించుకోవాల‌ని, కానీ.. ఆ సంప్ర‌దాయం క‌నుమ‌రుగైపోయింద‌ని అన్నారు.