Begin typing your search above and press return to search.

షిండే... ఏ రోటికాడ ఆ పాట...

By:  Tupaki Desk   |   13 Sep 2015 8:35 AM GMT
షిండే... ఏ రోటికాడ ఆ పాట...
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయమై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి.. ఒకప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నరు - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే సడెన్ గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని చేతులెత్తి మొక్కి కోరుతున్నానన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని తానే రూపొందించానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను చేతులు ఎత్తి మోక్కుతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వంటి మెరుగైన నగరం రావాలని తాను ఆశించానని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే అన్నారు. అయితే.... కాంగ్రెస్ పార్టీలో.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకూ విభజన పాపంలో వాటాఉంది. విభజన నాటికి ఆయనే హోం మంత్రి. అప్పుడేమీ చేయలేకపోయినా ఆయన ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదాపై మొసలి కన్నీరు కారుస్తున్నారు.

ఇంతకీ షిండే కు సడెన్ గా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా... కారణం ఆయన విజయవాడ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు రావడంతో ఆయన ఇక్కడి పాట ఎత్తుకున్నారు. విభజన నాటికి హోం మంత్రిగా ఉన్న ఆయన్ను ఎవరు ప్రశ్నిస్తారో అన్న భయంతో ఆయన ఇలా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రేమ కురిపించారు. విజయవాడలో అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం సభకు ఆయన వచ్చారు... బిజెపి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తోందన్నారు. ఎన్నికలు ఉన్నాయనే సాకుతో బీహార్ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు తాయిలాలు ప్రకటిస్తోందన్నారు. ఏపీలో ఎన్నికలు లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇన్ని మాటలు చెప్పిన షిండే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాపై క్లారిటీ, స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదో మాత్రం చెప్పడం లేదు.