Begin typing your search above and press return to search.

సాక్షిలో కీలక మార్పు..కొత్త డైరెక్టర్.?

By:  Tupaki Desk   |   2 July 2019 10:08 AM GMT
సాక్షిలో కీలక మార్పు..కొత్త డైరెక్టర్.?
X
పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వైఎస్ జగన్ సీఎం అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి చెంతనే ఇళ్లు - పార్టీ కార్యాలయం కట్టుకొని అక్కడి నుంచే ఏపీ పరిపాలన చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల యుద్ధంలో ఆయన వెన్నంటి ఉండి నడిచారు సాక్షి మీడియా జర్నలిస్టులు. పదేళ్లుగా జగన్ ను గెలిపించేందుకు ఆహోరాత్రులు తమ వంతు పాత్రను పోషించారు.

జగన్ సీఎం కాగానే హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయ్యారు. జగన్ తోపాటే ఆయన సతీమణి భారతి కూడా వెళ్లిపోయారు. కానీ సాక్షి మీడియా కేంద్రం మాత్రం ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది.. ఇన్నాళ్లు సాక్షి మీడియా చైర్మన్ గా ఉన్న భారతి ఇప్పుడు మీడియా వ్యవహారాలను చూసే పరిస్థితి లేకుండా పోయింది.

వైఎస్ భారతి ఇన్నాళ్లు సాక్షి మీడియా వ్యవహారాలను హైదరాబాద్ లో ఉండి పర్యవేక్షించారు. ఇప్పుడు ఆమె జగన్ తోపాటు ఏపీ రాజధానికి వెళ్లిపోవడంతో ఈ వ్యవహారాలను అంతే బాధ్యతగా చూడడానికి తాజాగా సూర్యనారాయణ అనే వ్యక్తిని నియమించినట్టు సాక్షి మీడియా నుంచి టాక్ వినిపిస్తోంది.

ఇక సాక్షి మీడియాను పటిష్టం చేయడానికి దైనిక్ భాస్కర్ నుంచి హిందీ వ్యక్తిని తీసుకొచ్చి సాక్షికి సీఈవోగా నియమించారు. ఆయన సాక్షిని ప్రక్షాళన చేస్తున్నారు. అయితే ఇప్పుడు సూర్యనారాయణను కొత్త డైరెక్టర్ గా నియమించారు అని సమాచారం. ఇప్పుడు హిందీ సీఈవో కూడా సూర్యనారాయణ కిందనే పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వైఎస్ భారతి.. ఈ సూర్యనారాయణను సాక్షి డైరెక్టర్ గా నియమించడంతోపాటు కొన్ని కీలక మార్పులు కూడా చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే సూర్యనారాయణను అందరు ఇన్ చార్జీలకు పరిచయం చేసి బాధ్యతలను అప్పగించారని సాక్షి నుంచి వార్తలొస్తున్నాయి. మరి నమ్మకంతో అప్పగించిన ఆ బాధ్యతను సూర్యనారాయణ ఎంత వరకు న్యాయం చేస్తాడన్నది వేచిచూడాలి.