Begin typing your search above and press return to search.

తొలి సెక్స్ అనుభవం.. సర్వే షాకింగ్!

By:  Tupaki Desk   |   2 Nov 2019 5:08 AM GMT
తొలి సెక్స్ అనుభవం.. సర్వే షాకింగ్!
X
కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు పెద్దలు. ఆ కొత్తదనం కోసం ఇప్పుడు భారతీయులు ఉబలాటపడుతున్నారు. రోటీన్ కు భిన్నం చేయడానికి సంకల్పిస్తున్నారట.. సెక్స్ లోనూ అంతే.. ఎప్పుడూ అవే భంగిమలా.. ఇంకా కొత్తగా చేయాలి.. ప్రయోగాలు చేయాలి.. ఇలా నీతి చిత్రాలు చూస్తూ రెచ్చిపోతున్నారట భారతీయులు..

‘పోకిరి’ సినిమాలో విలన్ సత్యరాజ్ మంచానికి తనను తాను కట్టేసుకుని కొరడాతో కొట్టించుకుంటూ అమ్మాయితో సెక్స్ కు ఉబలాగే పడే సన్నివేశం మనం ఆసక్తిగా చూశాం.. అలా సెక్స్ లో కొత్తదనం కోరుకునే వారు భారత దేశంలో పెరిగిపోతున్నారని తాజా సర్వేలో తేలింది. ఇదేకాదు.. కళ్లకు గంతలు కట్టుకొని శృంగారం చేయడం.. సెక్స్ టాయ్స్ వాడకం.. భారతీయుల్లో పెరిగిపోయిందని సర్వేలో నిగ్గుతేలింది.

‘ఇండియా టుడే సెక్స్ సర్వే’లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పదిహేడుళ్లుగా సర్వే చేస్తున్న ఈ సంస్థ 2003కు ఇప్పటికీ దేశంలో సెక్స్ కోసం పరితపిస్తూ కొత్తదనం కోసం ట్రై చేసే వారు పెరిగిపోయారని తేలింది. దేశంలోని 19 నగరాల్లో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 20 దాకా 4000 మంది స్త్రీ, పురుషులను ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు.

2003లో కేవలం 8శాతం మంది మాత్రమే 18 ఏళ్లకు ముందే సెక్స్ చేసిన వారు ఉండగా.. ఇప్పుడు ఈ ఏడాది ఏకంగా 18ఏళ్లకు ముందే సెక్స్ లో పాల్గొన్న వారి సంఖ్య ఏకంగా నాలుగింట మూడు వంతుల మంది ఉన్నారు. దీన్ని బట్టి 18 ఏళ్లలోపే నేటి యువత తొలి సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారన్న మాట..

ఇక దేశంలో ఇప్పుడు 85శాతం మంది నీలిచిత్రాలు చూస్తున్నారని సర్వే తేలింది. 2003తో పోలిస్తే ఈ సంఖ్య బాగా పెరిగింది. 48శాతం పురుషులు డబ్బులు చెల్లించి శృంగారాన్ని కొనుక్కుంటున్నారట.. ఇక స్త్రీలు మాత్రం కేవలం 3శాతం మందే డబ్బులిచ్చి ఎంజాయ్ చేస్తున్నారట..

60శాతం మంది శృంగారంలో పాల్గొన్నప్పుడు లైట్లు ఆపేయమని కోరుతున్నారట.. సెక్స్ చేసేటప్పుడు వీడియోలు సెల్ఫీలు మాత్రం వద్దంటే వద్దంటున్నారట.. ఇక 26శాతం భాగస్వామిని మోసం చేసి వేరొకరితో శృంగారంలో పాల్గొనాలని ఊహించుకుంటున్నారట.. ఇందులో పురుషులు 28శాతం. మహిళలు 24శాతం మంది ఉన్నారు. ఇక ఇద్దరితో శృంగారంలో పాల్గొనాలని భావిస్తున్న పురుషులు 23శాతం. ఇలా మహిళలు 19శాతం మాత్రమే.