Begin typing your search above and press return to search.
మేం ఆఫీస్ కు రాం.. ఇంట్లోనే పని చేస్తాం!
By: Tupaki Desk | 27 July 2020 2:40 PM ISTఇల్లే కార్యాలయమైంది.. ల్యాప్‌టాప్.. కంప్యూటర్‌తో ఇంట్లోనే కార్యాలయంలో చేసే విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి అందరి కళ్ల ముందు ఎటు కదలకుండా పని చేస్తుండడం.. అలా జీతం పొందడం బాగుంది. ఈ విధానం అందరికీ నచ్చింది. ప్రయాణ సమయం.. పెట్రోల్.. డీజిల్ ఖర్చు వంటివేవి లేకుండా ప్రశాంతంగా ఇంట్లోనే పని చేయడం ఉద్యోగులకు అలవాటు అయ్యింది. ఇప్పుడుకార్యాలయాలకు రండి అంటే కూడా రాలేని పరిస్థితి. వర్కు ఫ్రమ్ హోమ్ విధానానికే ఉద్యోగులు జై కొడుతున్నారు. మరికొంతకాలంపాటు ఇదే విధానంలో పని చేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. గతంలో చాలా అధ్యయనాల్లో తేలిన విషయమే మరోసారి తెలిసింది. అమెరికా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీ జోన్స్ లాంగ్ లా సాలే ఇన్‌కార్పొరేటెడ్ (జేఎల్‌ఎల్) ‘హోం అండ్ అవే: ది న్యూ హైబ్రిడ్ వర్క్ ప్లేస్?’పేరిట ఆసియా పసిఫిక్ రిపోర్ట్ ఓ నివేదిక వెలువరించింది. వీటిలో ఉద్యోగులంతా ఇంట్లో ఉండి పని చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది.
మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బయటకు రాలేని పరిస్థితి. అనేక దేశాల్లో వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచి పనికి అలవాటు పడినట్టు జేఎల్‌ఎల్ నివేదిక తెలిపింది. భారత్‌లో ‘వర్క్ ఫ్రం హోం’ పద్ధతిలో పనిచేస్తున్న వారిని వివిధ అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీరిలో 82 శాతం మంది ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని తెలిపారని నివేదికలో పేర్కొన్నారు. కార్యాలయాలకు వెళ్లలేకపోవడం, ప్రత్యక్షంగా మిత్రులు, సహచరులను కలుసుకోలేకపోవడాన్ని బాధాకరమైన విషయంగా తెలిపారు. వైరస్ వ్యాప్తితో ఇంటి నుంచి పనికి నెమ్మదిగా అలవాటు పడ్డామని.. ఇప్పుడు ఇంట్లోంచి పూర్తిస్థాయిలో పని చేయడానికి సిద్ధమయ్యామని 66 శాతం మంది భారతీయులు తెలిపారని జేఎల్ఎల్ తన నివేదికలో తెలిపింది. రోజూ కొత్త అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడం ద్వారా క్రమంగా తామంతా ఈ పద్ధతికి అలవాటు పడినట్లు తెలిపారని వివరించింది.
ప్రస్తుతం ఉద్యోగులు ‘రిమోట్ వర్కింగ్ సిస్టమ్’కు సులభంగా మారిపోయారని పేర్కొంది. ఇంటి నుంచి పనిచేసే విధానానికి విస్తృత స్థాయిలో ఆమోదం లభిస్తోంది. ‘న్యూ వర్క్‌ప్లేస్ మోడళ్ల’ను ప్రాంతీయంగా వివిధ కార్పొరేషన్లు రూపొందించుకోవాల్సి ఉంది. మేం మాట్లాడిన వారిలో చాలా మంది ఆఫీస్‌లో పని వాతావరణాన్ని, సహోద్యోగులను కలుసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు’ అని జేఎల్‌ఎల్ ఇండియా హెడ్, సీఈఓ రమేశ్ నాయర్ పేర్కొన్నారు. సర్వేలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సర్వే చేపట్టగా సగటున 61 శాతం మంది వృత్తి నిపుణులు ఆఫీసులకు తిరిగి వెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం, ఆఫీసుల్లో పనిని కలగలిపి ’హైబ్రిడ్ మోడల్’విధానాన్ని సమర్థిస్తామని భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా ఉద్యోగులు తెలిపారని జేఎల్ఎల్ తన నివేదికలో తెలిపింది.