Begin typing your search above and press return to search.

ముంబై లో ప‌రిస్థితులు దారుణం..ఆందోళ‌న రేపుతున్న స‌ర్వే!

By:  Tupaki Desk   |   24 April 2020 8:30 AM GMT
ముంబై లో ప‌రిస్థితులు దారుణం..ఆందోళ‌న రేపుతున్న స‌ర్వే!
X
దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌ లో క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆరు వేల‌కు పైగా కేసులు వెలుగులోకి రాగా ఆ దేశ రాజ‌ధాని ముంబైలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ముంబై మ‌హాన‌గ‌రం లోనే ఉన్నాయి. గురువారం ఒక్క రోజే 1,755 కొత్త కేసులు నమోదు కాగా వాటిలో 778 ఒక్క ముంబై లో ఉన్నాయి. ముంబయిలో మొత్తం కరోనా కేసులు 4,200. దీంతో కేసుల పెరుగుదల రేటు 8.2 శాతంగా ముంబైలో ఉంది. అయితే భ‌విష్య‌త్‌ లో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ప‌రిస్థితులు ఉంటాయ‌ని ఓ స‌ర్వే చెబుతోంది. మొత్తం 80 వేల సంఖ్య‌లో ముంబైలో కరోనా కేసులు పెరుగుతాయ‌ని ఆ స‌ర్వే చెబుతుండ‌డంతో ప‌రిస్థితులు ఎంతో ఆందోళ‌న‌క‌రంగా ఉంది.

ప‌రిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్క ముంబయిలోనే మే నెలాఖ‌రు వ‌ర‌కు 70వేల మంది వైరస్ బాధితులు ఉంటార‌ని ప‌లు సంస్థ‌లు అంచనా వేస్తున్నాయి. భారత్‌ లో కరోనా వైరస్ మహమ్మారి మే మధ్యనాటికి తీవ్రరూపం దాల్చుతుందని - తర్వాత క్రమంగా తగ్గుతుందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ప్రోటివిటీతో కలిసి టైమ్స్ నెట్‌ వర్క్ చేసిన‌ సర్వేలో తేలింది. టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్ పేరు తో నివేదికను రూపొందించారు. ఆ స‌ర్వేలో మూడు వేర్వేరు అంశాలను పరిగణన‌లోకి తీసుకున్నారు. సుమారు మే 22వ తేదీన నాటికి దేశంలో 75,000పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతాయని తెలిపింది. వాటిలో మ‌హారాష్ట్ర‌ తో పాటు ముంబై మ‌హా న‌గ‌రంలో అత్య‌ధిక కేసులు వెలుగు లోకి వ‌స్తాయ‌ని ఆ స‌ర్వేలో తేలింది.

ఈ క్ర‌మంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ) ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. మే నెల నాటికి తీవ్రమైన లక్షణాలున్న కరోనా వైరస్ బాధితుల కోసం అదనంగా కనీసం 3,000 కోవిడ్-కేర్ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీటీ హాస్పిటల్ - సెయింట్ జార్జ్ హాస్పిటల్స్‌ ను కూడా బీఎంసీ స్వాధీనం చేసుకుని క‌రోనా బాధితుల కోసం అందుబాటు లోకి తీసుకు రావాల‌ని భావిస్తున్నారు.