Begin typing your search above and press return to search.

మందు తాగే అలవాటుందా? చదవటం మిస్ కావొద్దు

By:  Tupaki Desk   |   3 Sept 2019 12:44 PM IST
మందు తాగే అలవాటుందా? చదవటం మిస్ కావొద్దు
X
రోజూ తాగే అలవాటుందా? లేదు.. లేదు.. వారంలో రెండు మూడు రోజులా? లేదండి అప్పడప్పుడు మాత్రమే తాగుతాం.. ఇలా చెప్పేవాళ్లు ఎవరైనా సరే.. డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్లంతా కొత్త అపాయం ముంచుకొస్తున్నట్లే. మితంగా తాగితే మందుకు మించి మంచి చేసేది మరొకటి ఉండదన్న మాట పాత చింతకాయ పచ్చడి లాంటిదని.. తాజాగా కొత్త సర్వే రిపోర్ట్ వచ్చేసిందని చెబుతున్నారు. తాజా రిపోర్ట్ చూసైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం.. రోజూ తాగినా ఫర్లేదు.. కానీ మితంగా తాగాలని చెప్పేవారు. అలాంటి వారి ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదంటారు. అయితే.. అదంతా తప్పుడు ప్రచారమని తాజా సర్వే తేల్చింది. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం వారానికి కేవలం 100 గ్రాముల మందు మాత్రమే తాగాలని.. అందుకు భిన్నంగా వారానికి ఐదు గ్లాసుల వైన్.. 9 గ్లాసుల బీర్ పుచ్చుకుంటే మాత్రం అకాల మరణం తప్పదన్న మాటను చెబుతున్నారు

మెడికల్ జర్నల్ ది లాన్సెట్ చేసిన అధ్యయనంలో 19 దేశాలకు చెందిన ఆరు లక్షల మంది మందు అలవాట్లను.. వారి ఆరోగ్య ఇబ్బందుల్ని పరిశీలించారు. దీని ప్రకారం తాజా అధ్యయనాన్ని తయారు చేశారు. వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకూ వారానికి తాగే వారు.. వారి జీవితకాలానికి రెండేళ్ల ముందే మృత్యువాతన పడతారని పేర్కొంది.

ప్రతి వారం ఆరు గ్లాసుల వైన్.. అంతే మోతాదులో బీర్ తీసుకోవాలని.. అంతకు మించి మద్యం సేవిస్తే మాత్రం ఆరోగ్యానికి హానికరమని తేల్చింది. మహిళలు రోజుకు ఒక డ్రింక్.. పురుషులు రోజుకు రెండుసార్లు మితంగా మద్యం తీసుకుంటే ఓకే అంటోంది. సో.. మరి మీ మందు లెక్కను కాస్త లెక్క చూసుకుంటే మంచిదేమో బాస్.