Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎంపై మండిపడుతున్న వాళ్లు

By:  Tupaki Desk   |   2 Jan 2023 9:17 PM IST
తెలంగాణ సీఎంపై మండిపడుతున్న వాళ్లు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై శాపనార్థాలు పెడుతున్నారు తెలంగాణలోని గ్రామాల సర్పంచ్ లు. కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలకు ఇవ్వకుండా తెలంగాణ సర్కార్ వాడేస్తోందని ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ లు రోడ్డెక్కారు. పంచాయితీ నిధులు పంచాయతీలకు జమ చేయాలంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆందోళనలు కూడా చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ప్రభుత్వ పట్టింపులేనితనితనంతో సర్పంచ్ లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సర్పంచ్ లు ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తూ కుటుంబ పోషణ కోసం నానా తిప్పలు పడుతుంటే.. తాజాగా మరో సర్పంచ్ మేకల కాపరిగా మారిన పరిస్థితి సర్పంచ్ ల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నేతలను కేసీఆర్ వాడి గ్రామాలకు ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేయాలని సంకల్పించిన సర్పంచ్ లు చాలామంది సొంత నిధులను అభివృద్ధి పనులకు కేటాయించడమే కాకుండా.. బయటనుంచి అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఇక ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి మంజూరు కాకపోవడంతో ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు.

చాలా మంది సర్పంచ్ లు అప్పులు తెచ్చి మరీ గ్రామ అభివృద్ధి పనులకు ఆ నిధులను వెచ్చించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఆ అప్పులు తీర్చడం కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. పంచాయతీకి వస్తోన్న అరకొర నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, పారిశుధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్ విధులకు సరిపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం 10 లక్షల వరకూ అప్పు చేశామని.. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతూ ఉండడంతో తాను ఇబ్బందులు పడుతున్నానని సర్పంచ్ లు చెబుతున్నారు.

ఇప్పటికే సర్పంచ్ లు ఆందోళనలు చేస్తున్నారు. నిధులు తిరిగి ఇవ్వకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తామని తాజాగా ఇందిరాగార్డెన్ ధర్నా చౌక్ లో ఈరోజు ఆందోళన చేశారు. దీనికి రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

అయితే కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడా కేసీఆర్ ప్రభుత్వం మళ్లించలేదని.. పంచాయితీలు చేసిన ఖర్చులకు బిల్లులను చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ బిల్లులు పంచాయతీలే చెల్లించాలి కానీ.. ప్రభుత్వం తమ నిధులు వసూలు చేసి చెల్లించడం ఏంటని సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్ ల సెగ కేసీఆర్ సర్కార్ కు తగులుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.