Begin typing your search above and press return to search.
అప్పగింతల్లో ఆశ్చర్యపరిచిన వధువు
By: Tupaki Desk | 29 March 2021 8:00 AM ISTసాధారణంగా పెళ్లి తర్వాత అప్పగింతల్లో వధువు ఏడుపులు పెడబొబ్బలు ఎక్కడైనా చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఆధునిక వధువులు అలాంటి ఏడుపులకు టాటా చెప్పారు. ధైర్యంగా కాబోయే వరుడితో కలిసి అత్తారింటికి వెళ్లిపోతున్నారు. అయితే కోల్ కతాలో ఓ వధువు మాత్రం ఆశ్చర్యపరిచింది.
కోల్ కతా వధువు తాజాగా సంప్రదాయంలో మార్పులు చేసింది. పెళ్లి తర్వాత పుట్టింటిని వీడి వరుడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా కారు నడుపుతూ అత్తింటికి బయలు దేరింది. భావోద్వేగాన్ని మనసులో ఉంచుకొని అందరికీ బైబై చెబుతూ కారును ముందుకు పోనిచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఈ పెళ్లి కూతురు కొత్త ట్రెండ్ ను ఇంకెంతమంది ఫాలో అవుతారని అంటున్నారు.
కోల్ కతాకు చెందిన వాణిజ్యవేత్త స్నేహాసింగీ ఇటీవల సౌగత్ ఉపాధ్యాయ్ ను పెళ్లాడింది. అప్పగింతల్లో భాగంగా తల్లిదండ్రులు ఆమెను అత్తింటికి సాగనంపారు. అయితే రోటీన్ గా వధువుతో కలిసి కారు వెనుకాల కూర్చోకుండా తనే డ్రైవర్ సీట్లోకి వచ్చి స్టీరింగ్ అందుకుంది. లెహంగాతోనే కారును నడుపుతూ అత్తింట్లో అడుగుపెట్టేందుకు బయలు దేరింది.
ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. దీంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. స్నేహాకు కోల్ కతాలో చాలా కేఫ్ సెంటర్లు ఉన్నాయి. మహిళా వాణిజ్యవేత్తగా నగరంలో మంచి పేరు సంపాదించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.