Begin typing your search above and press return to search.

ఆర్మీ క్లారిటీః అవ‌స‌ర‌మైతే ఎల్వోసీ దాటి దాడులు

By:  Tupaki Desk   |   7 Sep 2017 5:29 PM GMT
ఆర్మీ క్లారిటీః అవ‌స‌ర‌మైతే ఎల్వోసీ దాటి దాడులు
X
భార‌త ఆర్మీ స‌త్తాను మ‌రోమారు తేటతెల్లం చేసే ప్ర‌క‌ట‌న ఇది. ఇటీవ‌లి కాలంలో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఆయా దేశాల‌కు హెచ్చ‌రిక కూడా. అవ‌స‌ర‌మైతే స‌రిహ‌ద్దు రేఖ‌ దాటి దాడులు చేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ తేల్చిచెప్పింది. శ‌త్రువుల‌పై దాడి చేసేందుకు తాము నియంత్ర‌ణ రేఖ దాటేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని నార్త‌ర్న్ క‌మాండ్‌ కు చెందిన‌ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీ అంబూ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేర‌కు ఆయ‌న తేల్చిచెప్పారు.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌ లో నిర్వ‌హించిన‌ స‌ర్జిక‌ల్ దాడులను నార్త‌ర్న్ క‌మాండ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీ అంబూ స‌మ‌ర్థించారు. శ‌త్రువుల‌ను త‌రిమేందుకు ఆ దాడి అవ‌స‌ర‌మైంద‌ని - ఉగ్ర మూక‌ల‌ను ఎదుర్కొనే అంశంలో తాము ఎల్వోసీని ఉల్లంఘించేందుకు వెన‌క్కి త‌గ్గ‌మ‌న్నారు. క‌శ్మీర్‌లో కీల‌క‌మైన‌ పిర్ పంజ‌ల్ స‌మీపంలో ఉగ్ర క్యాంపులు, ల్యాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయ‌ని - వాళ్ల‌ను త‌రిమేందుకు స‌ర్జిక‌ల్ దాడులు అవ‌స‌ర‌మ‌న్నారు. ప్ర‌తి ఏడాది ఉగ్ర‌వాదులు అనేక సార్లు చొర‌బాటు ప్ర‌య‌త్నాలు చేస్తుంటార‌ని - కానీ అందులో స‌క్సెస్ అయ్యేది త‌క్కువే అన్నారు. క‌శ్మీర్ వ్యాలీలోకి అక్ర‌మంగా చొర‌బడాల‌నుకుంటున్న ఉగ్ర‌వాదుల‌ను మ‌న సైనికులు ధైర్యంగా అడ్డుకుంటున్నార‌ని నార్త‌ర్న్ క‌మాండ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీ అంబూ వివ‌రించారు.