Begin typing your search above and press return to search.

ఎలుకలతో సర్జికల్ స్ట్రైక్..డీఆర్డీఏ కొత్త ఆవిష్కరణ..

By:  Tupaki Desk   |   12 Jan 2023 12:30 AM GMT
ఎలుకలతో సర్జికల్ స్ట్రైక్..డీఆర్డీఏ కొత్త ఆవిష్కరణ..
X
ఓటీటీ వేదికగా ప్రసారమైన ఓ వెబ్ సిరీస్ లో ఓ బీటెక్ విద్యార్థి పక్షి ఆకారంలో ఉండే ఒక డ్రోన్ ను తయారు చేస్తాడు. దాని ద్వారా ఇతరుల సమాచారం తెలుసుకుంటాడు. ఇది ఆ సినిమాలో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు నిజంగా ఇలాంటి పోలిన దాన్ని ఒకటి తయారు చేసి సర్జికల్ స్ట్రైక్ చేయనున్నారు. శత్రువుల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డీఆర్డీఏ సరికొత్త వ్యూహాన్ని రచించనుంది. ఎలుకలను ఆయుధంగా చేసుకొని శత్రువుల సమాచారాన్ని తెలుసుకునేందకు ప్లాన్ వేస్తున్నారు. యానిమల్ ఫై బర్గ్స్ అని పిలువబడే ఈ ఎలుకలు వేగవంతంగా ఆర్మీకి సమాచారాన్ని ఇస్తుంది. దీని ద్వారా ఎదుటి వాళ్ల వ్యూహాలు ఏంటో తెలిసి అందుకు సన్నద్ధం కావచ్చని ఆలోచిస్తున్నారు.

ఇటీవల జరిగిన 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో డీఆర్డీవో సైంటిస్టు పి. శివప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏడాది కిందటే యానిమల్ ఫై బర్గ్స్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆయన దీని గురించి వివరిస్తూ జీవించిన ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తారు. ఇందు కోసం ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని పనులు ఇవి చేస్తాయి. వీటిని కేవలం సైన్యంలోనేకాకుండా విపత్కర పరిస్థుతుల్లో పరిశోధనలు చేయడానికి, బాంబ్ స్కాడ్ ప్రదేశాల్లో ఉపయోగించే అవకాశం ఉందని అయన వివరించారు.

అయితే టెక్నాలజీ పరంగా, సైన్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతాయి. కానీ జంతువులను ఇలా ఉపయోగించడంపై పెట్ సంఘాలు ఏవిధంగా స్పందిస్తాయనేది చూడాలి. మన దేశంలో జంతు సంరక్షణ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. జంతువుల వేటాడిన సందర్భంగా పెద్ద పెద్ద ప్రముఖులు సైతం జైలు జీవితం గడిపిన రోజులున్నాయి.

అలాంటిది సైన్యం కోసం ఎలుకలను ఇలా ఉపయోగించడంపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని చర్చలు సాగుతున్నాయి. అయితే వీటి కోసం సాధారణ ఎలుకలను కాకుండా ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన వాటిని ఉపయోగిస్తారా..? అనేది మరో చర్చ సాగుతోంది.

ఇక డీఆర్డీఏలో ఎన్నో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. శత్రు దేశాలను దెబ్బకొట్టేందుకు ఇప్పటికే అధునాతన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటోంది. గతంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ పై ఇతర దేశాల నుంచి కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ పొరుగు దేశం మనకు కలిగించిన నష్టం కంటే భారత్ చేసింది తక్కువేనని ప్రభుత్వ ప్రతినిధుల్లో కొందరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎలుకలే ఆయుధంగా మార్చుకొని నిర్వహించే సర్జికల్ స్ట్రైక్ కు మన దేశం నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.