Begin typing your search above and press return to search.

పుట్టినరోజు నాడు గొప్ప పనికి శ్రీకారం చుడుతున్న 'సురేష్ రైనా'!

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:40 PM IST
పుట్టినరోజు నాడు  గొప్ప పనికి శ్రీకారం చుడుతున్న సురేష్ రైనా!
X
క్రికెట్ టీం ఇండియా స్టార్ , మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ సురేష్ రైనా తన గొప్ప మనసు చాటుకున్నాడు. నవంబర్ 27న సురేష్ రైనా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన గారాల కుమార్తె పేరుతో ఉన్న ఎన్జీవో గ్రేసియా రౌనా ఫౌండేషన్ తరఫున ఓ బృహత్కార్యాన్ని చేప్పట్టబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌, జమ్మూ‌, ఎన్‌ సీఆర్‌ ప్రాంతాల్లోని దాదాపుగా 34 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురు పేరు మీదగా ఏర్పాటు చేసిన గ్రేసియా రైనా ఫౌండేషన్‌ తో ఈ సేవలు అందించనున్నట్లు రైనా ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

తన బర్త్ డే సెలబ్రేషన్స్ ముందుస్తుగానే ప్రారంభించిన సురేష్ రైనా యూపీలోని ఘజియాబాద్ ‌లో ఏర్పాటు చేసిన టాయిలెట్లు, తాగునీటి వసతి, చేతులు, గిన్నెలు కడుక్కునే ప్రదేశాలు, స్మార్ట్ క్లాసులను ప్రారంభించాడు. అలాగే పేద కుటుంబాలకు చెందిన 500 మంది మాతృమూర్తులకు రైనా దంపతులు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్బంగా సురేష్ రైనా మాట్లాడుతూ.. " నా పుట్టిన రోజు సందర్బంగా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు అనేవి తప్పనిసరి సదుపాయాలు. వీటిని యువా అన్‌స్టాపబుల్‌ సహకారంతో గ్రేసియా రైనా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాం. మేము చేసే ఈ సహాయం వల్ల ఎన్నో వేల మంది విద్యార్థులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది మా ఆరంభం మాత్రమే.. భవిష్యత్తుల్లో మరిన్ని పాఠశాలలకు ఇలాంటి సహాయాన్ని అందిస్తాం అని తెలిపారు.