Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కి గుడ్ బై చెప్పడానికి అసలు చెప్పిన సురేష్ రైనా..!

By:  Tupaki Desk   |   1 Sept 2020 4:20 PM IST
ఐపీఎల్ కి గుడ్ బై చెప్పడానికి అసలు చెప్పిన సురేష్ రైనా..!
X
ఐపీఎల్ 2020 .. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని జట్ల సభ్యులు కూడా యూఏఈ కి చేరుకొని క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసుకొని, ప్రాక్టీస్ మొదలెట్టారు. మరికొద్ది రోజుల్లోనే స్టార్స్ మెరుపులు చూడచ్చు అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా టీం ఇండియా మాజీ స్టార్ ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్ నుండి వెనుదిరిగాడు. ఈ సీజన్ నుండి అర్ధాంతరంగా తప్పుకున్న టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ట్విటర్ వేదికగా స్పందించాడు. క

రోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఫ్రాంచైజీతో విభేదాలు.. రైనా నిష్క్రమణకు కారణాలంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే రైనా మంగళవారం ఐపీఎల్ 2020 నుండి తన నిష్క్రమణకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందుగా పంజాబ్‌ లో తన మేనత్త కుటుంబంపై జరిగిన దాడిపై స్పందించాడు. ఇది చాలా దారుణమని, తన మామాను దుండగులు అతి కిరాతకంగా చంపారని రైనా తన భాదను వ్యక్తం చేశాడు. అలాగే ఆ ఘోరానికి పాల్పడిన దుండగులను వదిలి పెట్టవద్దని పంజాబ్ పోలీసులను కోరాడు.

దుండగుల దాడిలో మా అత్త, ఇద్దరు కజీన్స్ తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తు చికిత్సపొందుతూ మా కజిన్ గత రాత్రి ప్రాణాలు విడిచారు. మా అత్తమ్మ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మృత్యువుతో పోరాడుతుంది. ఈ రోజుకి ఆరాత్రి ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. ఎవరు చేశారనేది తెలియడం లేదు. పంజాబ్ పోలీసులను నేను కోరేది ఒక్కటే.. దుండగులను వదిలిపెట్టవద్దు. వారిని పట్టుకునే మార్గాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలి' అని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు ట్యాగ్ చేస్తూ రైనా వరుస ట్వీట్లు చేశాడు.

అయితే ,దుబాయ్‌ లో తనకు కేటాయించిన హోటల్‌ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే చివరకు ఐపీఎల్ ‌ను వీడేలా చేసిందని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో చెన్నై జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ రైనా నిష్క్రమణపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. దుబాయ్‌ లో రైనాకు కేటాయించిన గద అతనికి నచ్చలేదని, సరైన బాల్కనీ కూడా లేదని అతను జట్టు మేనేజ్‌ మెంట్‌ లో అన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయంలో జట్టు పెద్దలు ఏం చేయకపోవడంతో వ్యక్తిగత కారణాలు అంటూ స్వదేశం బయల్దేరిపోయాడని ప్రచారం జరిగింది. కానీ , తాజాగా రైనా ట్వీట్‌ ను చూస్తే.. రైనా కుటుంబ సభ్యులు దారుణ హత్యకి గురికావడంతోనే ఐపీఎల్ 2020 నుండి నిష్క్రమించాడు అని స్పష్టం అవుతుంది.