Begin typing your search above and press return to search.

ధోని ఇక ఆడడని రైనా భావోద్వేగం..బీసీసీఐకి చెప్పకుండా అప్పటికప్పుడు రిటైర్

By:  Tupaki Desk   |   18 Aug 2020 9:00 AM IST
ధోని ఇక ఆడడని రైనా భావోద్వేగం..బీసీసీఐకి చెప్పకుండా అప్పటికప్పుడు రిటైర్
X
స్వాతంత్ర దినోత్సవం నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే టీ 20 వరల్డ్ కప్ లో కచ్చితంగా ధోని ఆడతాడని అభిమానులంతా భావిస్తుండగా ధోని ఒక్కసారిగా షాకిచ్చి రిటైర్మెంట్ ప్రకటించారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన అరగంటకే మరో స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రైనా వయసు ఇప్పటికికూడా 33 ఏళ్లే. ఇంకా క్రికెట్ ఆడే సత్తా రైనాలో ఉంది. మిడిలార్డర్లో రైనా సేవలు ఉపయోగించుకోవాలని ఇటీవల కూడా పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచించారు.

కానీ అనూహ్యంగా రైనా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. మామూలుగా ఏ ఆటగాడైనా రిటైర్మెంట్ అవదలుచుకుంటే ముందుగా బీసీసీఐకి సమాచారం ఇస్తారు. కానీ రైనా బీసీసీఐకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధోని రిటైర్ ప్రకటించిన అరగంటకే తాను కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అందుకే బీసీసీఐ తన వెబ్సైట్లో ధోనీ రిటైర్మెంట్ గురించి వెల్లడించిందే తప్ప రైనా గురించి మెన్షన్ చేయలేదు. అందుకు కారణం రైనా సమాచారం ఇవ్వక పోవడమే. రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు రైనా బీసీసీఐకి సమాచారం ఇవ్వడంతో ఆరోజు అధికారికంగా సైట్ లో వివరాలు పొందుపరిచారు. తన మిత్రుడైన ధోని రిటైర్ ప్రకటించడంతో రైనా భావోద్వేగంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని బోర్డు సభ్యులు అంతా భావిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ రైనాకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2005 జూలై 30న శ్రీలంకతో జరిగిన వన్డేలో రైనా అరంగేట్రం చేశాడు. 2018 జూలై 17న ఇంగ్లాండ్ తో చివరి వన్డే ఆడాడు.