Begin typing your search above and press return to search.

తహసీల్దార్ ను హత్య చేసిన నిందితుడు మృతి.?

By:  Tupaki Desk   |   7 Nov 2019 10:39 AM IST
తహసీల్దార్ ను హత్య చేసిన నిందితుడు మృతి.?
X
రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతిచెందినట్టు సమాచారం. విజయారెడ్డిని చంపే క్రమంలో సురేష్ ఒంటికి కూడా నిప్పు అంటుకుంది. దాదాపు 60శాతం కాలిన గాయాలైన అతడు అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు..పోలీసులు నిందితుడు సురేష్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

తాజాగా గురువారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ చనిపోయినట్టు తెలిసింది. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోలీసులు, సురేష్ కుటుంబ సభ్యులు, మీడియాకు సమాచారం అందించినట్టు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ విజయారెడ్డిని సురేష్ అనే కౌలు రైతు పెట్రోల్ పోసిన నిప్పటించారు. దీంతో విజయారెడ్డి కార్యాలయంలోనే అగ్నికి ఆహుతైంది. విజయారెడ్డి మధ్యాహ్నం బోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

కౌలు రైతుకు, భూయజమానికి మధ్య తలెత్తిన భూవివాదమే తహసీల్లార్ విజయారెడ్డి హత్యకు కారణమైంది. తనకు పట్టారాదనే ఉద్దేశంతోనే విజయారెడ్డిని చంపినట్టు కౌలు రైతు సురేష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తహసీల్లార్ ను కాపాడే ప్రయత్నంలో ఆమె డ్రైవర్ కూడా మరణించాడు. ఇప్పుడు నిందితుడు సురేష్ కూడా మరణించడంతో దాదాపుగా ఈ కేసు క్లోజ్ అయినట్టేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సురేష్ వెనుకున్న వారిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.