Begin typing your search above and press return to search.

ప్రియంగా మారనున్న సూరత్ చీరలు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   31 Oct 2021 1:30 AM GMT
ప్రియంగా మారనున్న సూరత్ చీరలు.. ఎందుకంటే?
X
సూరత్.. గుజరాత్ లోని ఓ ప్రముఖ నగరం. ఇక చీరలకు పెట్టింది పేరు. మామూలు చిఫాన్ శారీస్ నుంచి కాస్ట్లీ చీరలు కూడా అక్కడ ఉత్పత్తి అవుతాయి. అయితే మనదేశంలో వస్త్ర మార్కెట్ దాదాపు అక్కడి నుంచే ఎక్కువగా జరుగుతుంది. ఈ సూరత్ చీరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో లభించేవి. కానీ దీపావళి తర్వాత అవి కాస్త ప్రియంగా మారనున్నాయని తెలుస్తోంది. సహజంగా సూరత్ లో అతి తక్కువకు కొన్న చీరలను... ఇక్కడ వ్యాపారులు భారీ ధరకు విక్రయిస్తారు. ఇకపోతే అక్కడే కాస్త ఎక్కువ ధర ఉంటే... ఇక వినియోగదారుని వద్దకు వచ్చేలోపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సూరత్ లో టెక్స్ టైల్స్ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇకపోతే చీరల ధరలను పెంచాలని అక్కడి వ్యాపారులు భావిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచనాలని అక్టోబర్ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. కరోనా తర్వాత అప్పుడప్పుడే పుంజుకున్న వస్త్ర పరిశ్రమపై... ఈ వేతనాల పెంపు సమస్య ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో అందుకు వ్యాపారులు అంగీకరించారు. ఆ ప్రభావం ఇప్పుడు వీటి ధరలపై పడింది. క్లాత్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల ఛార్జీలను పెంచాలని అక్కడి వ్యాపారులు నిర్ణయించారు. ధరలు పెంచాలని గత పదిహేను రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అక్కడి వ్యాపార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇకపోతే రూ.వెయ్యి చీరపై దాదాపు రూ.100 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


పండుగ సీజన్ ఉన్నందున ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడం లేదు. వివిధ ట్రేడింగ్ తర్వాత దీపావళి అనంతరం చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పై ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాగా చౌకగా లభించే సూరత్ చీరలు మరింత ప్రియం కానున్నాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు... వస్త్ర పరిశ్రమలోని ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని దక్షిణ గుజరాత్ టెక్స్‌టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఇకపోతే బొగ్గు ధర పెరగడం వల్ల ప్రాసెసింగ్ ధరలు కూడా అధికమయ్యాయని అక్కడి వ్యాపారులు అభిప్రాయపడ్డారు.

ఇటీవల కాలంలో దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వస్త్రాల ముడి సరుకు ధరలతో పాటు ప్యాకింగ్ ఛార్జీలు, నూలు రేటు, గ్రే ఫ్యాబ్రిక్ ధరలు అమంతం పెరిగాయని వారు తెలిపారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నదని చెబుతున్నారు. అందుకే సుదీర్ఘ చర్చల అనంతరం చీరల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రూ.300 చీరపై రూ.50... రూ.1000 చీరపై రూ.100 ను పెంచుతున్నట్లు దక్షిణ గుజరాత్ టెక్స్‌టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దీపావళి తర్వాత నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే తక్కువ ధరకు ఎక్కుమ మొత్తంలో సూరత్ చీరలను కొనే వారికి ఇది కాస్త చేదు వార్తే. అయితే పెరిగిన ఈ ధరలు వస్త్ర ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి