Begin typing your search above and press return to search.
ముఖానికి వజ్రాల మాస్కులు.. సంపన్నుల్లో ఇదే ఇప్పటి ట్రెండ్
By: Tupaki Desk | 11 July 2020 9:15 AM ISTమిగిలిన ప్రపంచానికి భారత్ కు కాస్త తేడా ఉంది. విలయాన్ని తమ అభిరుచులకు తగ్గట్లు మార్చేసుకునే టాలెంట్ మనోళ్ల సొంతం. కరోనా నేపథ్యంలో యావత్ ప్రపంచం ఆగమాగం అయిపోతున్న వేళ.. బతికితే చాలురా అనుకునేటోళ్లు కోట్లల్లో ఉన్నారు. బతికున్నాళ్లం రోటీన్ గా బతికితే ఏం బాగుంటుంది..నలుగురిలో కాస్త భిన్నంగా కనిపించాలని తపించేటోళ్లకు మన దగ్గర కొదవ లేదు. అలాంటివారి పుణ్యమా అని ఇప్పుడు కొత్త ట్రెండ్ తెర మీదకు వచ్చేసింది.
ముఖానికి మాస్కు లేకుండా.. చేతికి శానిటైజర్ వాడకుండా బతకలేని దరిద్రపుగొట్టు రోజులు వచ్చేశాయి. సమీప భవిష్యత్తులోనూ ఈ పరిస్థితికి భిన్నంగా కనిపించని వైనం స్పష్టమవుతున్న వేళ.. మెదడుకు పదును పెట్టేస్తున్న పలువురు సంపన్నులు.. ముఖానికి వాడే మాస్కుల విషయంలో కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చేశారు. రోజూ ఒకేలాంటి మాస్కులు పెట్టుకోవటం ఏమిటి? తమ స్థాయికి తగ్గట్లు మాస్కులు పెట్టుకోంటే ఏం బాగుంటుందని ఆలోచించే బ్యాచ్ రోజురోజుకి పెరిగిపోతోంది.
దీంతో.. ఇలాంటి వారి అవసరాల్ని గుర్తించిన గుజరాత్.. సూరత్ వజ్రాల వ్యాపారులు ఇప్పుడు వజ్రాల మాస్కుల్ని తయారు చేసేస్తున్నారు. ఇంతకీ వారికి ఆ ఆలోచన ఎలా వచ్చిందంటారా? ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఒకరు వజ్రాల వ్యాపారి వద్దకు వచ్చిందట. త్వరలో తన పెళ్లి జరగనుందని.. అందరిలా రోటీన్ గా ముఖానికి తాను..తనకు కాబోయే భర్త మాస్కులు పెట్టుకుంటే ఏం బాగుంటుందని చెప్పి.. ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించి ఐడియా ఇస్తారా? అని అడిగిందట.
సదరు వ్యాపారి మెదడుకు పదును పెట్టి.. మాస్కును వజ్రాలతో సెట్ చేసి తయారు చేస్తే.. ఆమెకు బాగా నచ్చిందట. సంపన్న వర్గాల్లో సమ్ థింగ్ స్పెషల్ గా చేస్తే.. అదెలా వైరల్ గా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా? ఇక్కడ అదే జరిగింది. సదరు వజ్రాల మాస్కులు అందరిని ఆకర్షించటమే కాదు.. ఇప్పుడు అలాంటివి ముఖానికి తగిలించుకోవటం స్టేటస్ సింబల్ గా మాత్రమే కాదు.. తమ స్థాయి చెప్పుకునేవిగా తయారయ్యాయట.
రానున్న కొద్ది నెలలు మాస్కులతోనే బండి లాగించాల్సిన పరిస్థితి. మాస్కుల మీద సెట్ చేసే వజ్రాల వల్ల పోయేదేమీ లేదు. కావాలంటే.. వాటిని తర్వాత వాడేసుకోవచ్చు. దీంతో.. నష్టం తక్కువ. లాభం ఎక్కువ కావటంతో వ్యాపారులు సైతం పెద్ద ఎత్తున వజ్రాల మాస్కుల్ని తయారు చేస్తున్నారట. వివిధ రకాలైన డిజైన్లతో సిద్ధం చేసిన ఈ వజ్రాల మాస్కులు ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారాయి. ఇంతకీ వీటి ధర ఎంత ఉంటుందంటారా? అక్కడికే వస్తున్నాం.
వజ్రాల మాస్కుల ధర ఒక్కొక్కటి రూ.1.5లక్షల నుంచి రూ.4లక్షల వరకు పలుకుతుందట. మాస్కుల మీద సెట్ చేసే వజ్రాలు ఎటూ చెడిపోవు కాబట్టి.. వ్యాపారులకే కాదు.. కొన్నోళ్లకు సైతం ఎలాంటి నష్టం ఉందంటున్నారు. దీనికి తోడు నిత్యం ఒకేలాంటి మాస్కుల్ని వాడితే ఏం బాగుంటుందన్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుందట. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ‘‘మా మాస్కులు చోరీకి గురయ్యాయి’’ అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రోజులు రానున్నాయన్న మాట.