Begin typing your search above and press return to search.
వ్యవసాయ చట్టాలపై సుప్రీం 'స్టే ' ... !
By: Tupaki Desk | 12 Jan 2021 2:32 PM ISTకొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందరి కోసం కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. తమకు ఆ అధికారం ఉందని అభిప్రాయపడింది. అంతేకాదు, చట్టాలను నిలిపివేసే అధికారం కూడా తమకు ఉందని తెలిపారు. అనంతరం సాగు చట్టాల అమలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు స్టే కొనసాగుతుందని వెల్లడించింది. రైతు సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో అశోక్ గులాటీ, హర్‌ప్రీత్ సింగ్ మాస్, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ధావంత్ సభ్యులుగా ఉండనున్నారు. రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండు రోజుల పాటు మూడు వ్యవసాయ చట్టాలపై వాదనలు విన్న సుప్రీంకోర్టు, తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వీటి అమలుపై స్టే విధించింది. తాము నియమించిన కమిటీ ముందుకు వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు రైతు సంఘాలకు సూచించింది. అయితే కమిటీ ముందుకు వెళ్లేందుకు రైతు సంఘాలు ముందుగా నిరాకరించాయి.
అవసరమైతే సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించలేదు. కచ్చితంగా కమిటీ ముందుకు రైతు సంఘాలు తమ వాదన వినిపించాల్సిందే అని స్పష్టం చేసింది. సోమవారం నాటి విచారణ సందర్భంగా కేంద్రం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం చర్యల పట్ల తాము నిరాశతో ఉన్నామని సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా, లేదా మమ్మల్నే ఆ పని చేయమంటారా, అని కేంద్రాన్ని నిలదీసింది.